Nara Lokesh: నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ భద్రత.. ప్రాణాలకు అపాయం ఉందనే అలా చేశారా?

Nara Lokesh: ఇంటెలిజెన్సీ సిఫారులతో కేంద్రం నారాలోకేష్‌కు భద్రత పెంచింది. ప్రస్తుతం పెరిగిన భద్రతా సిబ్బంది ఆయన రక్షణగా ఉన్నారు. ఇప్పటికే విధుల్లో చేరారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆయనకు సెక్యూరిటీగా ఉండనున్నారు. అందులో భాగంగా 33 మంది సెక్యూరిటీ సిబ్బంది నారాలోకేష్ ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి విధుల్లో చేరారు. వైసీపీ ప్రేరేపిత దాడులు లోకేష్ పై జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్సీ కేంద్రానికి రిపోర్టులు ఇచ్చింది. అంతేకాదు.. నక్సలెట్ల హెచ్చరికలు కూడా ఆయను ఉన్నాయని తెలిపింది. దీంతో.. అప్రమత్తమైన కేంద్రం ఆయన భద్రతను పెంచింది. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో.. టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు టీడీపీ శ్రేణులను ఒకింత ఆందోళన కలిగించారు. ఎక్కడిక్కడ నారాలోకేష్ వాహనాలను చెక్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చెక్ చేయడంలో తప్పులేదు. ఒకే రోజు గంట వ్యవధిలోనే రెండు, మూడు చోట్ల తనిఖీలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో.. టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాలోకేష్ కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వాహనాలు ఎందుకు తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితులు లోకేష్ కు సెక్యూరిటీ పెంచడానికి కారణమని చెప్పొచ్చు.

దీనికితోడు..కొన్నాళ్లుగా లోకేష్ సెక్యూరిటీపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నారాలోకేష్‌కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని సూచించింది. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం వై కేటగిరి సెక్యూరిటికే పరిమితం చేసింది. ఆయన మంత్రి నుంచి కేవలం ఎమ్మెల్సీకే పరిమితం అయ్యారు కనుక ఆయన సెక్యూరిటీ తగ్గించామని ప్రభుత్వం అప్పుడు చెప్పుకొచ్చింది. కానీ.. సెక్యూరిటీ ఆయనకు ఉన్న పదవులను బట్టి కాకుండా.. ఆయనకు ఉన్న థ్రెట్ బట్టి కల్పించాలి. కానీ.. అవేవీ చూడకుండా ఒక ఎమ్మెల్సీకి అంత అవసరం లేదని కొట్టి పారేసింది. ఆ తర్వాత టీడీపీ నేతలు లోకేష్ భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్, హోంశాఖకు లేఖలు రాశారు. కానీ.. అప్పుడు స్పందన రాలేదు. కానీ.. లోకేష్ మాత్రం సెక్యూరిటీ గురించి ఆలోచించలేదు. ఉన్న సెక్యూరిటీతోనే ప్రజల్లోకి వెళ్లారు. గతంలో యువగళం యాత్ర, ఇప్పుడు శంఖారావం యాత్రను వై కేటగిరి సెక్యూరిటీతోనే చేశారు. కానీ, ఎన్నికల ప్రచారంలో ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ ఓటమి ఖాయంగా పలు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి అధికార పార్టీ భయాందోళనలు సృష్టించడానికి కూడా కొన్ని దాడులు చేయొచ్చనే అనుమానాలను టీడీపీ శ్రేణులు వ్యక్తం చేశాయి. ఇటీవల కాలంలో చంద్రబాబుపై దాడులు జరిగాయి. పుంగనూరులో జరిగిన దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి మృతి చెందాడు కూడా. ఇలాంటి దాడులు ఎన్నికల దగ్గర పడేకొద్ది పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయని తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో అల్లర్లు కూడా జరుగుతాయని ఇంటెలిజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. పైగా చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని లోకేష్ కు భద్రత పెంచారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తిరుపతి అలిపిరిలో నక్సలేట్లు ఆయన కారుపై బాంబు దాడి చేశారు. తృటిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి చంద్రబాబుకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారు. నక్సలెట్లు, టెర్రరిస్టుల లిస్టులో ఉన్న మాజీ సీఎం కుమారుడిగా లోకేష్ కు కూడా ఎన్నికల సమయంలో భద్రత పెంచాలని ఇంటెలిజెన్సీ కేంద్రానికి సూచించింది. ఇంటెలిజెన్సీ సిఫారుసులతో ఆయన వై కేటగిరి భద్రత నుంచి జెడ్ కేటగిరికి పెంచారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -