Nara Lokesh: ఆ విషయంలో బాధ పడుతున్న నారా లోకేశ్.. ఏం జరిగిందంటే?

Nara Lokesh: నారా లోకేష్ యువగలం పాదయాత్ర నెల్లూరు రూరల్ కు చేరింది. ఈ ఏరియాలో లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈయన మహిళా శక్తి పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన మహిళలతో ఈయన మాట్లాడారు. అంతేకాకుండా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు.ఈ క్రమంలోనే లోకేష్ ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి ఒక సమాధానం నెటిజన్లకు ఫుల్ స్టప్ ఇస్తుంది.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటినుంచి చెల్లి లేదు అనే లోటు ఉండేదని తెలిపారు. చిన్న‌ప్ప‌టి నుంచి చెల్లి అంటే ఇష్ట‌మ‌న్నారు. త‌న‌కు కూడా అమ్మాయి పుట్టాల‌ని కోరుకున్న‌ట్టు లోకేశ్ చెప్పుకొచ్చారు. త‌న త‌ల్లి త‌న‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచార‌న్నారు. మొన్న పొర‌పాటున ఓ మాట అంటే, అమ్మ ఫోన్ చేసి మరి తిట్టారు అని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఈ క్రమంలోనే లోకేష్ తనకు చెల్లి ఇష్టమని చెప్పిన ఈయన ఆ అవకాశం లేకపోవడంతో తనకైనా కూతురు పుట్టాలని,కూతురు లేని లోటును తణుకు స్పష్టంగా తెలుస్తుందని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు. అయితే లోకేష్ చేసిన ఈ కామెంట్లపై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు .నీకు కనక చెల్లి ఉంటే చంద్రబాబు నాయుడు తన మామకు ఎలా వెన్నుపోటు పొడిచారో తనుకు వచ్చే అల్లుడు కూడా తనకు వెన్నుపోటు పొడుస్తారన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కూతురిని ప్లాన్ చేయలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

లోకేష్ కి కనక చెల్లెలు ఉంటే ప్రస్తుతం నందమూరి హీరోలకు పట్టిన గతే లోకేష్ కి పట్టి ఉండేదని ఈపాటికి ఈయన రాజకీయ భవిష్యత్తు కూడా నాశనమయ్యేది అంటూ వివిధ రకాలుగా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తనకు చెల్లెలు లేకపోయినా కనీసం కూతురు ఉండాలని ఆ కోరిక అయినా తీరుతోందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -