Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్ర అప్పటినుంచే.. రూట్‌మ్యాప్ ఇదే..

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడటంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా పాదయాత్రకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. పాదయాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

 

జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారు అయింది. కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడ నుంచి మంగళగిరి మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర జరగనుంది. దాదాపు ఏడాది వరకు లోకేష్ పాదయాత్ర జరగనుంది. ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలా లోకేష్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్దం చేశారు.

 

లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త జోష్ వస్తుందని, నేతల మధ్య విబేధాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తోన్నారు. అలాగే గ్రామస్థాయిలో పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు. పాదయాత్ర సమయంలో నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యి పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారని, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇది ఉపయోగపడుతుందని టీడీపీ భావిస్తోంది.

 

ఇప్పటికే చాలా నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ పాదయాత్రలో టికెట్ పై కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను లోకేష్ బుజ్జగించి పార్టీకి యాక్టివ్ గా పనిచేసేలా చేస్తారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ పాదయాత్ర పార్టీకి కలిసొస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తోన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్ర చేయగా.. ఆ తర్వాత ఏపీలో జగన్ తర్వాత ఇప్పుడు లోకేష్ పాయదాత్రకు శ్రీకారం చుట్టారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -