Nara Lokesh: ఓటమి తేలిపోవడం వల్లే జగన్ దుర్మార్గపు చర్యలు.. నారా లోకేశ్ కామెంట్లకు సమాధానం ఉందా?

Nara Lokesh: ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. ఇది వైసీపీ స్టైల్. ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రశ్నిస్తారు. అధికారం ఉన్నవాళ్లు సమాధంన చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో గౌరవమైన సాంప్రదాయం. అధికార పార్టీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల తరుఫున ప్రతిపక్షం.. అధికార పార్టీని ప్రశ్నిస్తుంది. దానికి అధికార పార్టీ సమాధానం చెప్పాలి. కానీ.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రజలు, మీడియా ఇలా ఎవరూ ప్రశ్నించినా దానికి ఎదురు దాడే సమాధానం. ఇక ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్నించడమే సమాధానం. ఒకవేళ ప్రతిపక్షం కూడా మరింత గట్టిగా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడి తప్పదు. గత ఐదేళ్లులో చాలా ఘటనలు చూశాం. కానీ, ప్రజలు తరఫున ప్రతిపక్షం అడుగుతుంది కాబట్టి.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని మాత్రం వైసీపీ ఫీల్ అవ్వదు.

పైగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది… వైసీపీ తిరుగుబాటు చర్యలు, దాడులు మరింతగా పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమయింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కొత్తగా ఓ కంపెనీ రాలేదు. మొదటి నుంచి ఉన్న కంపెనీలు రాష్ట్రంలో నిలబడలేదు. రోడ్లుపై ప్రయాణించే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. కొంతమేర అమలు చేసినా.. వాటి కోసం రాష్ట్రాన్ని దివాళా తీసే వరకు తీసుకెళ్లారు. దీనిపై ఎవరు ప్రశ్నించినా వైసీపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. దీంతో.. ఎదురు దాడి చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే గతంలో మీరేం చేశారని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

దీనిపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో జగన్ ముఖ్యమంత్రి ముసుగు తీస్తున్నారని సెటైర్లు వేశారు. ఫ్యాక్షనిస్టు పోకడలకు తెరలేపారని మండిపడ్డారు. సొంతపార్టీ నేతలే జగన్ ఫ్యాక్షనిజాన్ని తట్టుకోలేక పక్క చూపులు చూస్తున్నారని అన్నారు. అందుకే నెల్లూరు వైసీపీలోని సీనియర్ నేతలంతా టీడీపీ గూటికి చేరారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్లు చేరుతారని లోకేష్ అన్నారు. కానీ.. వైసీపీ నేతలకు ఆ హక్కు లేదన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. టీడీపీలో చేరిన వైసీపీ నేతలతో పాటు.. టీడీపీ పాత నాయకులను జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లపైకి పోలీసులను, ఏసీబీ పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు టీడీపీ నేతలు విజేతా రెడ్డి, వేమిరెడ్డి విజజభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి బెదిరింపుకలు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు.

పోలీసులు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహించాలని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ రాబొతుందని… తర్వాత ప్రభుత్వం మారడం ఖాయమని.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల భరతం పడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అధికారులు ఒక పార్టీకి కొమ్ముకాయడం మంచిది కాదని లోకేష్ హితవు పలికారు.

అంతేకాదు.. సెంట్రల్ ఎన్నికల కమిషన్ కూడా జగన్ ఆగడాలపై దృష్టిపెట్టాలని సూచించారు. జగన్ కు అనుకూలంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకేష్ ఇంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి మూడు రోజులు అవుతున్నా.. అధికారపార్టీ నుంచి స్పందన లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -