Nara Lokesh: ఎఫ్ఐఆర్‌లు మ‌డిచి ఎక్క‌డ పెట్టుకుంటారో పెట్టుకోండి.. నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Nara Lokesh: ఎన్నికల సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క పార్టీ నేత పెద్ద ఎత్తున తమ నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తూ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి కూడా నారా లోకేష్ ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలుపొంది తీరాలన్న కంకణం లోకేష్ కట్టుకున్నారు దీంతో ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేష్‌ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బీసీలను ఉద్దేశిస్తూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేశామని తెలిపారు. బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం అని అభివర్ణించారు.రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు. ఇలా బీసీల కోసం ఆదరణ పథకం పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ డెవలప్మెంట్ ఇలా బీసీల కోసం ఆదరణ పథకం పిల్లల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన తెలుగుదేశం జెండా అని తెలిపారు.

ఇకపోతే చేనేత కార్మికులకు కళ్ళు గీత కార్మికులకు 50 సంవత్సరాలు లోపే పెన్షన్ ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం అని ఈయన వెల్లడించారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి బీసీలే నా వెన్నెముక అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల వెన్నెముక విరగొట్టారని ఈయన కామెంట్లు చేశారు. అంతేకాకుండా బీసీలకు అందాల్సినటువంటి పథకాలు అన్నిటిని దూరం చేశారు.

ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు. అయితే ఆ ఎఫ్ ఐ ఆర్ లని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి కేవలం రెండే రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఆ తరువాత మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో చాలామంది పేర్లు ఉన్నాయి.. జాగ్రత్త అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -