Kethireddy-Nara Lokesh: నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. కేతిరెడ్డి గురించి చెప్పింది నిజమేనా?

Kethireddy-Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా 58వ రోజు యువగలం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం లో పాదయాత్రను కొనసాగించారు. యువగళం పాదయాత్రకు బయలుదేరుతుండగా తొగట వీర క్షత్రియ సంఘం ప్రతినిధులు వారే స్వయంగా నేసిన పట్టువస్త్రాలను నారా లోకేష్‌కు అందించారు. వాటిని స్వీకరించి ఇదొక అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నానని చెపుతూ నారా లోకేష్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం దారిలో జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసితులు, చేనేత కార్మికులు, బోయ సామాజికవర్గానికి చెందిన ప్రజలతో నారా లోకేష్‌ ముఖాముఖీ సమావేశమయ్యారు. దారిలో చిత్రావతి నది వద్ద ఉప్పలపాడు ఇసుక రీచ్ వద్ద నుంచి ఇసుకను తరలిస్తున్న ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చెందిన లారీలను చూపిస్తూ నారా లోకేష్‌ సెల్ఫీ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీని రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. తరువాత బత్తలపల్లి లో జరిగిన సభకు హాజరైన స్థానిక ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ..

2019 ఎన్నికలలో ఈ కేతిరెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ మొత్తం రూ.5 కోట్లు అని పేర్కొన్నాడు. కానీ ఈ నాలుగేళ్ళ కాలంలోనే దాదాపు వెయ్యి కోట్లు సంపాదించాడు ఈ కేటుగాడు. కేతిరెడ్డి కేటురెడ్డిగా ఎప్పుడు మారాడు? నేను వస్తుంటే దారిపొడవునా ఈ కేటురెడ్డి ఇసుక లారీలే కనిపించాయి. ప్రతీరోజు యూట్యూబ్‌లో గుడ్ మార్నింగ్ అంటూ డ్రామాలు ఆడటం, ఇసుక దోచుకోవడం తప్ప ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధికి ఈ కేటురెడ్డి ఏమైనా చేశాడా? అంటూ నిలదీసాడు. ఆనాడు టిడిపి హయాంలో చేసిన పనులే తప్ప ఈయన కొత్తగా చేసిందేమీ కనిపించదు.

టీటీడీపి హయాంలో జిల్లాలో 20 వేల ఇళ్ళు నిర్మించాము. మరో 20 వేలమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు మేము కట్టిన ఆ ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెలిసి హడావుడిగా వాటికి రంగులు వేయిస్తున్నారు. యువగలం పాదయాత్ర బహిరంగసభలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ… పరిటాల కుటుంబంతో మీ అందరికీ ఎంతో అనుబందం ఉందని తెలుసు. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేయబోతున్న పరిటాల శ్రీరామ్‌ను గెలిపించి మీరందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు నారా లోకేష్‌. తర్వాత పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్‌ అనంతపురం జిల్లా అభివృద్ధి చేసి జిల్లా పట్ల తన ప్రేమాభిమానాలు చాటుకొన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అభివృద్ధి చేసింది. వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ టిడిపి అధికారంలోకి తప్పకవస్తుంది. అప్పుడు నేను ధర్మావరం నియోజకవర్గం అభివృద్ధి కొరకు గట్టిగా కృషి చేస్తాను. నారా లోకేష్‌ అన్న అడుగుజాడలలో నడుస్తూ జిల్లాలో టిడిపిని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతాము అని చెప్పుకొచ్చారు పరిటాల శ్రీరామ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -