Naresh: సీనియర్ నటుడు నరేష్ చేసిన తప్పుల వల్లే గొడవలు జరుగుతున్నాయా?

Naresh: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో.. ప్రస్తుతం సోషల్ మీడియా, మీడియా ఫోకస్ మొత్తం మహేష్ బాబు కుటుంబంపైనే ఉంది. కంటతడిలో కూడా అభిమానుల గుండెల్లో నిలుస్తున్నాడు మహేష్ బాబు. అభిమానులకు భోజనం పెట్టి వారి దీవెనలు పొందాడు. అలాగే మరో వైపు సీనియర్ నటుడు నరేష్ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. కృష్ణ వారసులైనా.. మహేష్ బాబు-నరేష్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితం, పిల్లల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమడి రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 

కృష్ణ మృతి తర్వాత కూడా మహేష్ బాబు-నరేష్ బంధుత్వం కొనసాగుతుందా? అనే ప్రశ్నకు రామారావు సమాధానమిచ్చారు. ‘మహేష్ బాబుకి నరేష్‌కి అసలు పొందికే ఉండదు. మహేష్ బాబు సినిమాలు, బిజినెస్‌లు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. అతడి గురించి ఎలాంటి ఫుకార్లు కూడా మనం వినలేదు. అందుకు కృష్ణ గారికి మహేష్ బాబు అంటే అంత ఇష్టం. కానీ నరేష్ విషయంలో ఆ హుందాతనం కనిపించడం. ఆ ఫ్యామిలీ రూట్స్ నరేష్‌లో కనిపించవు. ఇప్పటివరకు నాలుగు వరకు పెళ్లిళ్లు చేసుకుని ఇంటి పరువును తీస్తూనే వచ్చారు.’ అని చెప్పారు.

 

 

మహేష్ బాబుకు నరేష్‌కు విభేదాలు ఉన్నాయా? అని యాంకర్ ప్రశ్నించగా..‘మహేష్-నరేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే, తండ్రి పరువు తీస్తున్నాడని అందరి మనసులో ఉంటుంది. నాలుగు వరకు పెళ్లిళ్లు చేసుకుని.. వాళ్లల్లో ఆ లోపం ఉంది.. ఈ లోపం ఉందని చెప్పి దూరం చేసుకున్నాడు. ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడు. కృష్ణ గారి అంత్యక్రియలప్పుడు నరేష్.. పవిత్రా లోకేష్‌కు తీసుకురావడం మహేష్‌కు అస్సలు ఇష్టం లేదు.’ అని సీనియర్ జర్నలిస్ట్ ఇమడి రామారావు అన్నారు.

మహేష్ బాబు-నరేష్‌కు మధ్య ఆస్తి విభేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు.. సీనియర్ జర్నలిస్ట్ రామారావు మాట్లాడుతూ.. ‘ఆస్తి విషయంలో మహేష్ బాబు పట్టించుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మహేష్ బాబుకు సొంతంగా ఆయన సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. ఇక తండ్రి సంపాదనలో కృష్ణ కుటుంబం ఎలా పంచుకుంటుందో వేచి చూడాలి.’ అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -