Naresh: పవిత్రా లోకేశ్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేష్.. ఏం చెప్పారంటే?

Naresh: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటుడు నరేష్నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. కానీ అదంతా కూడా కేవలం సినిమా కోసమే అంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా వీరిద్దరు కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం మళ్లీ పెళ్లి. కాగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేష్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తున్న ప్రేక్షకులు ఖచ్చితంగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలే సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటున్నారు కానీ ఆ ట్రైలర్ ని చూస్తే అది నిజ జీవితంలో జరిగిన సంఘటనలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట ప్రమోషన్స్ లో భాగంగా రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్‌ పై రెచ్చిపోయారు.

 

ఇకపోతే తాజాగా నరేష్‌ కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ.. మేము ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నాము. అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటాను అని తెలిపాడు నరేష్. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్‌ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు.. కానీ త్వరలోనే చేసుకుంటాము అని చెప్పుకొచ్చాడు నరేష్. కాగా ప్రెస్ మీట్ లో భాగంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -