Adipurush: భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిపివేసిన నేపాల్.. ఏం జరిగిందంటే?

Adipurush: ఈనెల 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఆది పురుష్. ఇది వాల్మీకి రామాయణం కాదు ఓంరౌత్ రామాయణం కేవలం గ్రాఫిక్స్ కోసం మాత్రమే చూడొచ్చు అని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతుండగా అసలు ఇది రామాయణమేనా అంటూ సాంప్రదాయవాదులు పెదవి విరుస్తున్నారు.

అవెంజర్స్ సినిమాని భారతీయ కథని అద్దినట్లు ఉంది ఈ సినిమా అంటూ సినీ విమర్శకులు సైతం తమ అభిప్రాయాన్ని ఘాటుగా చెప్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమాని సినిమాగా మాత్రమే చూడండి ఈ విషయాన్ని డైరెక్టర్ ముందే చెప్పాడు కదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదాలు కాకుండా ఆది పురుష్ కి కొత్త వివాదం చుట్టుముట్టింది.

 

అదేంటంటే సినిమాలో సీతని భారతీయ సంతతికి చెందిన స్త్రీగా చూపించడం నేపాల్ వాళ్ళకి మింగుడు పడటం లేదు. ఎందుకంటే సీత నేపాల్ ఆడపడుచు గా వాళ్ళు భావిస్తారు. నేపాల్ కి చెందిన జానకిపూర్ జనకుని రాజ్యాం గా అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. అందుకే సీతని జానకి అని పిలుస్తారు. ఖాట్మండు మేయర్ అదే విషయాన్ని ఆది పురుష మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువస్తే వాళ్లు కూడా పాజిటివ్ గానే స్పందించారు.

 

కాకపోతే మేయర్ ఇచ్చిన గడువులోగా అతను చెప్పిన మార్పులు ఏవి సినిమాలో జరగలేదు. దాంతో ఆగ్రహించిన ఖాట్మండు మేయర్ ఆది పురుష సినిమా ప్రచారాలను నిలిపివేయాలని ఆదేశించారు కేవలం ఆది పురుష సినిమాని మాత్రమే కాకుండా భారతీయ సినిమాలన్నింటినీ నిలిపివేసేలాగా చర్యలు తీసుకున్నారు.

 

ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం నుండి నేపాల్ లోని కీలక ప్రాంతాలలో ఆది పురుష్ చిత్ర ప్రదర్శన ఆగిపోయింది దీనికి బదులుగా నేపాల్ లోకల్ సినిమాలో హాలీవుడ్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఖాట్మండు మేయర్ తమ ఆదేశాలను వెలువరించిన కొద్దిసేపటికే నేపాల్ లోని ఫోఖరా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా తమ ప్రాంతంలో భారతీయ చిత్ర ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -