Prabhas Fan: ప్రభాస్ ఫ్యాన్ తీరుపై మండిపడుతున్న నేటిజన్స్… ప్రభాస్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడా అంటూ?

Prabhas Fan: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూడాలా అని ఎదురుచూస్తున్నటువంటి అభిమానుల కోరిక నేడు నెరవేరింది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇలా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శనమవుతున్న సమయంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున థియేటర్ల బయట హంగామా చేస్తున్నారు థియేటర్ బయట పెద్ద ఎత్తున కటౌట్లను ఏర్పాటు చేయడమే కాకుండా గజమాలలు వేస్తూ పాలాభిషేకం చేయడంతో పాటు పెద్ద ఎత్తున టపాసులు కూడా పేలుస్తున్నారు. ఇలా థియేటర్ల ముందు ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి.

ఈ విధంగా ఈ సినిమాని అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల మాత్రం అభిమానం పీక్స్ కి చేరిందని చెప్పాలి. కొంతమంది ఈ సినిమా ప్రదర్శితం కాస్త ఆలస్యమైన థియేటర్లను ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా మరి కొంతమంది అభిమానులు అత్యుత్సాహం కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా ప్రభాస్ కటౌట్ కు వీర తిలకం దిద్దడం కోసం బీర్ బాటిల్ తో తన చేతిని కట్ చేసుకుని ఆ రక్తంతో తిలకం దిద్దారు. ఇలా ఆ బీర్ బాటిల్ తో పలుమార్లు చేయి కట్ చేసుకోవడమే కాకుండా బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా అభిమాని బీర్ బాటిల్ చేతపట్టి అత్యుత్సాహం కనబరుస్తూ చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అభిమాని చేయి కోసుకుంటూ ఉన్నప్పటికీ ఎవరు ఆపే ప్రయత్నం చేయకుండా ఇదంత వీడియోగా చిత్రికరిస్తూ ఉండడంతో ఈ వీడియో పై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇస్తాడా ఇదేం పిచ్చి పని అంటూ ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మరికొందరు అక్కడున్నటువంటి వారు ఈ సంఘటనను ఆపకుండా ఇలా వీడియో తీస్తూ కూర్చున్నారా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -