Mahesh Babu: మహేష్ కూతురిపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్.. ఎందుకంటే?

Mahesh Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇంత చిన్న వయసుకే సితారకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావడంతో సితారకీ చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాగా సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

తరచూ సోషల్ మీడియాలో తనకు సంబందించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కాగా సితార షేర్ చేసే ఫోటోలు వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా గట్టమనేని అభిమానులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు ఆ వీడియోలపై కామెంట్ ల వర్షం కూడా కురిపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా సితార చేసిన పనికి అభిమానులు మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. తాజాగా సితార ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో సితార కార్ కిటికీలో నుంచి తల బయటకు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి చూసిన కొంతమంది నెటిజన్స్ సితార పై మండిపడుతున్నారు ఎందుకిలా చేశావ్‌.. నువ్విలా చేయడం చూసి చాలా మంది అలానే చేస్తారు.. రోడ్డుమీద ట్రాఫిక్‌లో పిల్లలు ఇలా ఫోజులు ఇస్తే.. జరగరానిది ఏదైనా జరిగితే వాళ్లు కుటుంబాలు ఎంత బాధపడతాయి? నువ్వు పెట్టే ఏ పోస్ట్‌ అయినా అందరికి ఉపయోగపడేలా ఉండాలి అని అందరూ ఘాటుగా రియాక్ట్ అవుతుండగా కొందరు కూల్ గా చెబుతున్నారు. అలా చేయడం తప‍్పమ్మా.. బుద్దిగా లోపలికి వెళ్లి సీట్‌ బెల్ట్‌ వేసుకో అని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సితారకు మద్దతుగా మాట్లాడుతూ సితార కేవలం కారు అని ఉన్నప్పుడు మాత్రమే ఫోటోలు దిగింది అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -