Venkata Chaitanya: రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త చైతన్య.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?

Venkata Chaitanya: నిహారిక, జొన్నలగడ్డ చైతన్య.. మొన్నటి వరకు ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిన విషయం తెలిసిందే. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు విడివిడిగా ఉంటున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా ఎట్టకేళ్ళకు నిహారిక చైతన్య ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలే అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత ఎవరి జీవితం వారిది అన్నట్టుగా ఎవరికి వారు బతికేస్తున్నారు. విడాకుల తర్వాత నిహారిక మరింత ఎంజాయ్ చేస్తూ ఫుల్ జాలీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక మాజీ భర్త అయినా జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే జొన్నలగడ్డ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చైతన్య రిలేటివ్స్ కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి వాళ్ల నాన కూడా పెద్ద పోలీస్ ఆఫిసర్ అని సెలబ్రిటీకి మించిన గౌరవం ఉందని తెలుస్తోంది. ఒక రకంగా ఈ వార్త నిహారికకు, మెగా అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి.

నిహారిక లేనిదే చైతన్య బతకలేడు అనుకున్న వాళ్ళకి చైతన్య ఘాటైన ఆన్సర్ ఇవ్వబోతున్నాడు తన పెళ్లి ద్వారా అంటూ చైతన్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే జొన్నలగడ్డ చైతన్య స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -