Manchu Vishnu: ట్రోలర్స్ డీటెయిల్స్ ఉన్నాయి.. కంప్లైంట్ ఇచ్చాను: మంచు విష్ణు

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జిన్నా’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా లాంటి సినిమాలతో పోటీ పడుతూ దీపావళి కానుకగా జిన్నా విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఫెర్ఫార్మెన్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండాఫ్‌లో దివి వద్య, సన్నిలియోన్ పాత్రలు ఎమోషనల్‌గా మలిచారు. అయితే ఈ సినిమాకు ఉన్న పాజిటివ్‌ను కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కలెక్షన్ల విషయంలో పేలవంగా మారాయి.

జిన్నా సినిమా బిజినెస్ ఆశాజనకంగా సాగలేదు. భారీ రేంజ్‌లో రైట్స్ కోట్ చేయడంతో డిస్టిబ్యూటర్లు ముఖం చాటేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓవరాల్‌గా రూ.4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కేవలం కర్ణాటకలో రూ.25 లక్షల మేర బిజినెస్ చేయగలిగింది. అయితే మంచు ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత హిట్ కళ కనిపించింది. ఈ సినిమా కలెక్షన్ల రూపంలో ఢీలా పడ్డా.. సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘సినిమా బాగుందని నా ఫ్రెండ్స్ ఇచ్చే రివ్యూలను నమ్మను. ఎందుకంటే నాకు వీళ్లంతా నాకు తెలిసిన వాళ్లు. వాళ్లందరూ బావుందని చెప్తారు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పలేను. కానీ సినిమా బాగుందని మాత్రం చెప్పగలను.’ అని తెలిపారు.

‘అయితే ట్రోలర్స్ మాత్రం పని గట్టుకుని మా ఫ్యామిని ట్రోల్ చేస్తున్నారు. వారందరి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ల డీటెయిల్స్ ఇప్పుడు బయట పెట్టను. ఎందుకంటే అతను కూడా ఇండస్ట్రీలోనే ఉంటారు. మేం కూడా ఇండస్ట్రీలోనే ఉంటాము. వాళ్ల గౌరవానికి భంగం కలిగించము. కాబట్టి వాళ్ల వివరాలను ఇప్పుడు బయట పెట్టలేను. వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.’ అని పేర్కొన్నారు. అయితే ట్రోల్ చేసే వారి వల్ల తనకు మంచి జరిగిందని మంచు విష్ణు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Bhuvaneshwari-Brahmani: భువనేశ్వరి, బ్రాహ్మణి విషయంలో సీఐడీ స్కెచ్ ఇదేనా.. వాళ్లకు ఇబ్బందులు తప్పవా?

Bhuvaneshwari-Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు పీఠాన్ని ఎక్కిస్తే, ఆ పదవిని కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు నేటి మంత్రులు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నాడు. తనను అన్యాయంగా కేసులో...
- Advertisement -
- Advertisement -