Sharmila: ఏపీలో షర్మిల ధాటికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారా.. ఏమైందంటే?

Sharmila: ఏపీ రాజకీయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అట్రాక్షన్ గా ఉన్నారు. నూకలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పేరు పెద్ద ఎత్తున వినపడగా, ఆ తర్వాత వారాహి యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన పేరే ఎక్కువగా వినిపించేది. టీడీపీ, జనసేనలు పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ ప్రజలు, మీడియా ఫోకస్‌లో ఎక్కువగా ఉండేవారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అర్దాంగి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి కూడా ప్రజలకు మద్యకు రావడంతో వారిద్దరూ కూడా ఏపీ రాజకీయాల్లో కొన్ని వారాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

 

మరి వైసీపిలో ఎవరూ లేరా? అంటే స్వయంగా జగనే ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసుకుంటూ వైసీపిలో ప్రకంపనలు పుట్టించేస్తూ ఒక్కసారిగా న్యూస్ మేకర్ గా నిలుస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ ప్లేసులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వైఎస్ షర్మిల నిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను ఆమె పూర్తిగా హైజాక్ చేశారనే చెప్పవచ్చు. మొన్నటి వరకు ఏపీలో అడుగుపెట్టడానికే ఇష్టపడని ఆమె ఇప్పుడు ఏపీలో దుమ్ము లేపుతున్నారు. అన్న జగన్ ని ముఖ్యమంత్రిగా, వైసీపి అధినేతగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా అన్ని కోణాల నుంచి ఆమె చీల్చి చెండాడుతున్నారు. తరచూ సభ నిర్వహిస్తూ సభల్లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకుని తీవ్ర స్థాయిలో మండిపడుతుంది షర్మిల.

వైసీపి నేతలెవరూ ఆమె ధాటికి తట్టుకోలేకపోతున్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమెపై నేరుగా ఎదురుదాడి చేయలేక చంద్రబాబు ని నిందిస్తున్నారు. అయితే ఆమెను ఎదుర్కొనే ప్రయత్నంలో వైసీపి నేతలు చేస్తున్న విమర్శలతో తిరిగి వారే ఇబ్బంది పడే పరిస్థితి చేజేతులా కల్పించుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఆమె మాటలకు మౌనంగా ఉండి పోతున్నారు. ఆమె సొంత అన్న జగన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పోరాడుతుండటంతో, టీడీపీ , జనసేనల ఉనికే కనిపించడం లేదు. వినిపించడం లేదు. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన నేతల విమర్శలు, వారి పొత్తులు, కార్యక్రమాలు అన్నీ వైఎస్ షర్మిల చేస్తున్న ఈ హడావుడిలో చాలా పేలవంగా కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మరో విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను, పార్టీలను వైఎస్ షర్మిల మూడు రోజులలోనే హైజాక్ చేశారని చెప్పక తప్పదు. ఆమె దూకుడు చూస్తుంటే, టిడిపి, జనసేనలు కూడా కాస్త దూకుడు పెంచాల్సిన అవసరం కనపడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -