Unstoppable Season 2: బాలయ్య అన్ స్టాపబుల్ పై నాన్ స్టాప్ ట్రోలింగ్స్.. ఆడుకుంటున్న నెటిజన్స్?

Unstoppable Season 2: నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ కు ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించు వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఇక ఈ సీజన్ మంచి హిట్ కావడంతో నిర్వాహకులు రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

ఇక రెండవ సీజన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 14వ తేదీ మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది.అయితే ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కార్యక్రమం పై మరింత ఆసక్తి నెలకొంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ముగ్గురు కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోవడమే కాకుండా 1995లో జరిగిన రాజకీయ సంఘటనల గురించి కూడా ప్రస్తావనకు తీసుకోవచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1995లో ఎన్టీఆర్ ను గద్దరించి ఆ పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకున్న విషయంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదురవుతుంది. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నప్పటికీ ఆయన తన పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చారని చంద్రబాబు చెప్పడం అందరికీ హాస్యం తెప్పిస్తుందని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరి కొంతమంది నెటిజన్లు బాలకృష్ణ అమాయకత్వంపై జాలి పడుతున్నారు.నీలాంటి అమాయకత్వపు బామ్మర్దులు ఉండటం వల్లే చంద్రబాబు లాంటి వెన్నుపోటు దొంగ ఎన్టీఆర్ గారిని మాయ చేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అన్ స్టాప్ అబుల్ కార్యక్రమం మాత్రం మొదటి సీజన్ తోనే నాన్ స్టాప్ ట్రోలింగ్ షో గా మారిపోయింది. మొదటి ఎపిసోడ్ పైనే తీవ్రస్థాయిలో నేటిజన్స్ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -