Health Tips: నువ్వులు తింటే ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు!

Health Tips:  నువ్వులను వివిధ వంటకాల్లోనే కాకుండా హోమాల్లో, ఔషధాల్లో వినియోగిస్తుంటారు. నువ్వుల నూనె కూడా వివిధ రోగాల నివారణకు దోహదపడుతోంది. అయితే నువ్వులలోను వివిధ రకాలు ఉంటాయి. ఎర్ర నువ్వులు, తెల్ల నువ్వులు, పైర నువ్వులు, అడవి నువ్వులు, నల్ల నువ్వులు ఉంటయి. నువ్వులను వాడడంతో వాతం, చర్మ రోగాలన్నీ సమసిపోతాయి. శరీరం బలంగా, కాంతివంతంగా ఉండేలా చేయడంలోనూ నువ్వులు చాలా సహకరిస్తాయి. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడం, బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా నువ్వులు తోడ్పాటునందిస్తాయి.

అయితే.. నల్ల నువ్వులు అన్నింటిలో కన్నా చాలా శ్రేష్టమైనంది. ఆ తర్వాత ఎర్ర నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి. నువ్వులను ఏ పదార్థాలతో కలిపినా వాటి రుచి పెరుగుతుంది. అంతేకాకుండా ఇతర పదార్థాలతో కలిపినప్పుడు వాటి గుణాన్ని పోగొట్టుకోకుండా ఇతర పదార్థాల గుణాలతో కలిసి పోతాయి. నువ్వులను నేరుగా ఉపయోగించడం వల్ల శరీరంలో కఫం, వాతం పెరుగుతుంది. వీటిని దోరగా వేయించి కానీ, తేనెతో కలిపి కానీ ఉపయోగించడం వల్ల ఎటువంటి దోషాలు కలగవు. నువ్వులు అన్ని ధాన్యాల కంటే ఎంతో ఉత్తతమైనవి. శరీరానికి అమితమైన బలాన్ని కలిగించడంలో, పురుషులలో వీర్య వృద్దిని కలిగించడంలో ఇవి దోహదపడతాయి.

మూత్రం బిగుసుకు పోయిన వారు నువ్వులను, పత్తిగింజలను సమపాళ్లలో తీసుకుని కళాయిలో వేసి మాడ్చి బూడిద చేయాలి. ఈ బూడిదను పావు టీ స్పూన్‌ మోతాదులో తీసుకుని దానిని 100 గ్రాముల పెరుగులో వేసి కలపాలి. ఇందులోనే 20 గ్రాముల తేనెను కూడా వేసి కలిపి తినడం వల్ల రెండు పూటల్లోనే సమస్య తగ్గి మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రాశయంలో, మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఎండిన నువ్వుల చెట్టును సమూలంగా సేకరించి కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను మూడు వేళ్లకు వచ్చినంత పరిమాణంలో తీసుకుని దానిని ఒక కప్పు పాలలో వేసి అందులోనే ఒక టీ స్పూన్‌ తేనెను కూడా వేసి కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల రాళ్లు కరిగి పోయి మూత్రం ద్వారా బయటకు పోతాయి.

దంతాలు బలహీనంగా ఉన్న వారు రోజూ నల్ల నువ్వులను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగి అనుపాణంగా చల్లటి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా దంతాలు గట్టిపడతాయి. పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. నువ్వులను వేయించి బెల్లం పాకంలో వేసి ఉండలుగా చేసి నిల్వ చేసుకోవాలి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -