Jr NTR-Yash: అయ్యో.. ఈ ఇద్దరి స్టార్ హీరోల పరిస్థితి ఏంటి ఇలా మారింది!

Jr NTR-Yash:  సినీ లవర్స్ కి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ లు యష్, ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లు గా మరో స్థాయిలో హడావిడి చేస్తున్నారు. ఒకరు కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే. మరొకరు ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా హడావిడి చేస్తున్నారు.

అంత భారీ స్థాయిలో విజయాలని అందుకున్న ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల పరిస్థితి ప్రస్తుతం ఒకే విధంగా అనిపిస్తుంది. అంటే ఇటు ఎన్టీఆర్ అటు యష్ లు ఇద్దరూ ఖాళీగానే ఉంటున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వీరిద్దరూ తదుపరి చిత్రం వైపు షూటింగ్ నేపథ్యంలో కదలడం లేదు. దీనికి సంబంధించిన అప్ డేట్స్ కూడా వెల్లడించడం లేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా తికమక పడుతున్నారు.

త్వరలో ఎన్టీఆర్ 30 సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి అసలు ఏం మాట్లాడటం లేదు. అటు కేజిఎఫ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా కోట్లు కొల్లగొట్టిన యష్ కూడా యష్19 ప్రాజెక్టు గురించి ఏమాత్రం చెప్పడంలేదు. పైగా యష్ కూడా ఇంకా కేజీఎఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. దీంతో యష్ అభిమానులు ఈ విషయంలో చిరాకు పడినట్లుగా అనిపిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. అలా వీరిద్దరూ స్టార్లు తమ తదుపరి సినిమా విషయంలో అసలు ఏమాత్రం ముందడుగు వేయకుండా అలా ఆలోచిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఏమో అలా.. యష్ ఏమో ఇలా అని కొందరు సినీ ప్రేమికులు అనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి హీరోలు తమ అభిమానుల బాధ చూడలేక ఇకనుంచి అయినా తదుపరి సినిమాకు పూనుకుంటారో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -