Andhrawala: వామ్మో.. ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ లో ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Andhrawala: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాదాపు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక దర్శకరుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోయింది. బి టౌన్ ప్రేక్షకుల సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఫంక్షన్ లో చాలా రచ్చ జరిగింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్షన్ ప్రొడ్యూసర్ రాజు గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో ఈ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పొలిటికల్ గా కొడాలి నాని కూడా ఈ ఆడియో ఫంక్షన్ కి సపోర్టివ్ గా నిలిచి ఈ ఫంక్షన్ కి మరింత గ్రాండ్నెస్ తెప్పించాడు. దాదాపు పది రైళ్లు, వందల కొద్ది ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశారు. నిమ్మకూరు గ్రామం లో ఎక్కడ చూసినా జనాలే.. కొన్ని లక్షల మంది జనాలు ఆడియో ఫంక్షన్ కి హాజరయ్యారు.

పోలీసులు సైతం ఏం చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. దాదాపు పది కిలోమీటర్ల వరకు ఇసుకేస్తే రాలనంత జనాలు నిమ్మకూరు చుట్టుపక్కల ప్రవేశించారు. ఎంతో భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ ఆడియో ఫంక్షన్ ను అరగంట సమయంలోనే ముగించారు. ఎందుకంటే అక్కడ జనాభా ఆ స్థాయిలో ఉంది కాబట్టి. ఎన్టీఆర్ ను తన అభిమానులు చూడడానికి మరో స్థాయిలో ఎగబడుతున్నారు. కేవలం 20 సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్ ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -