NTR: వీరసింహా నెగిటివ్ కామెంట్లపై తారక్ రియాక్షన్ ఇదే!

NTR: సంక్రాంతి బరిలో వచ్చిన బాలయ్య బాబు సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓపెనింగ్స్ బాలయ్య కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’కి రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నందమూరి బాలయ్య అభిమానులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అలాంటివి పుష్కలంగా పెట్టి.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమాను పూర్తిస్థాయి పండగ భోజనంలా సిద్ధం చేశాడు.

 

బాలయ్య తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’లో డైలాగ్స్ మీద ఏపీలో చర్చ సాగుతోంది. అధికారంలోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసేలా బాలయ్య డైలాగులు ఉండగా.. తన డైలాగులు ఎవరిని ఉద్దేశించి పెట్టినవో ప్రజలకు తెలుసంటూ బాలయ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక డైలాగుల సంగతి పక్కన బెడితే యాక్షన్ సీన్లు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నా.. ఓ సీన్ గురించి మాత్రం కాస్త డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది.

 

బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలో వచ్చే ఓ సీన్ లో అతిగా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వీటిని నందమూరి అభిమానులు కొట్టిపారేస్తుండగా.. తాజాగా నందమూరి బాలయ్యను వెనకేసుకొస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఓ సీన్ లో అతిగా చేశాడనే కామెంట్ల విషయంలో తారక్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడని, బాబాయ్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తే తాట తీస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మొదటిరోజే దాదాపు రూ.26కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో బాలయ్య కెరీర్ లో ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ప్రస్తుతం బాలయ్య సంక్రాంతి సంబరాల కోసం నారా వారి పల్లెకు కుటుంబంతో సహా చేరుకోగా.. నారా చంద్రబాబు కుటుంబంతో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -