NTR: బిగ్‌బాస్ సీజన్-7కు తారక్‌కు అన్ని కోట్ల పారితోషికమా?

NTR: బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 5 సీజన్లు పూర్తి చేసుకున్న షో.. ప్రస్తుతం 6వ షో కంటిన్యూ చేస్తోంది. అయితే గతంలో నడిపిన షోలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి. టీఆర్‌పీలోనూ దూసుకెళ్లాయి. కానీ సీజన్-6 మరీ చప్పగా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలిమినేషన్ రౌండ్స్ పరంగా బిగ్‌బాస్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ షోపై పలు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు కంటెస్టెంట్లను సేవ్ చేసి.. కావాలనే మరొకరిని షో నుంచి బయటకు పంపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ సీజన్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

 

కాగా, తెలుగులో బిగ్‌బాస్ సీజన్-1 2017 జులై 16న ప్రారంభమైంది. ఈ రియాలిటీ షోకి హోస్ట్ లు ఎంతో ప్రత్యేకం. ఆడియన్స్ ఈ షోని ఆసక్తికరంగా చూసేలా, ఆడియన్స్ ను టీవీ ముందు కూర్చునేలా చేయాలి. పెద్ద టాస్క్ తో కూడుకున్న పని. అందుకే బిగ్‌బాస్ సీజన్-1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హోస్ట్ గా నియమించింది. ఈ షో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఎన్టీఆర్ ఈ షో క్రేజ్‌ను తారాస్థాయికి చేర్చారు. సీజన్‌-2కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.

 

నాని తన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్-3కి హీరో నాగార్జునను హోస్ట్ గా నియమించింది. ఈయన ఆధ్వర్యంలో షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. దాంతో వరుసగా సీజన్-4, సీజన్-5, సీజన్-6కి నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ చేసింది. కానీ సీజన్-6 మరింత డిజాస్టర్‌గా కొనసాగుతోంది. షోను చూడటానికి ప్రేక్షకులు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. దాంతో బిగ్‌బాస్ సీజన్-7 కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సీజన్-1కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్‌ను మళ్లీ సీజన్-7లో హోస్ట్ గా వ్యవహరించమని అడిగినట్లు సమాచారం. దీనికి కోసం తారక్‌కు బిగ్‌బాస్ నిర్వాహకులు రూ.30కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -