Chandrababu-NTR: చంద్రబాబును కలవనున్న ఎన్టీఆర్.. లెక్కలు మారుతున్నాయా?

Chandrababu-NTR: ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. ఎన్నికల నేపథ్యంలో మరికాస్త హీట్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో చంద్రబాబుతో ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో ఫ్యామిలీ టూర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఇండియాకు రానున్నారు. భారత్ కు రాగానే ఆయన చంద్రబాబును కలవనున్నారు. ఇది అనధికార సమాచారం అని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

 

పదో తేదీన వీరిద్దరూ సమావేశం కానున్నారని, చంద్రబాబు ఇంట్లోనే ఇద్దరూ పలు విషయాలు చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే సమావేశ అజెండా ఏంటో ఇంకా తెలియడం లేదు. కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సమావేశం ఇప్పుడు కీలకం కానుంది.

 

టీడీపీ కార్యకర్తలు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడల్లా రాజకీయాల జోలికి వెళ్లనని అప్పట్లోనే తెలియజేశాడు. తాను సినీ రంగంలోనే ఉన్నత స్థానానికి వెళ్లిన తర్వాత రాజకీయ కెరీర్ గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఎన్టీఆర్ తో చంద్రబాబుకు గ్యాప్ ఉందని ప్రచారం జోరుగానే జరుగుతోంది.

 

తాజా భేటీ ద్వారా అవన్నీ కనుమరుగు కానున్నాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా గత ఏడాది హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి కొన్ని విషయాలపై చర్చించారు. ఆ టైంలో ఆ సమావేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొంత కలకలం రేపిందనే చెప్పాలి. దాదాపుగా 15 నిమిషాల పాటు అమిత్ షాతో భేటీ జరిగింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారనేది అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చలు లేవనెత్తింది. ఇకపోతే ఇప్పుడు చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -