NTR 30: పవన్ కు ఎన్టీఆర్ దిమ్మతిరిగే షాక్.. అదే టైటిల్ ఫిక్స్ చేయడంతో?

NTR 30: టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల తర్వాత చాలామంది దర్శకలు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అలా ఎన్టీఆర్ 30 వ సినిమాగా కొరటాల శివతో చేస్తున్నాడు. ఇక 31వ సినిమాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.

అయితే ఇప్పటికే కొరటాల కాంబినేషన్ లో చేసి మంచి హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. దీంతో కొరటాల మరోసారి ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తున్నాడని తెలియటంతో భారీ అంచనాలు వెలువడ్డాయి. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి నందమూరి అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి బాగా ఎదురు చూస్తున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. ఇందులో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే.. రేపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినీ బృందం మరి కొద్దిసేపట్లో ఫస్ట్ లుక్ విడుదల చేశారు..అంతేకాకుండా సినిమా టైటిల్ కూడా ప్రకటించారు.

 

అయితే అంతకుముందే ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా తాజాగా అదే టైటిల్ ని ఫిక్స్ చేశారు సినీ బృందం. అయితే నిజానికి దేవర అనే టైటిల్.. పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కాంబోలో వస్తున్న సినిమాకు ముందు అనుకున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

 

దీంతో దేవర అనే టైటిల్ ఎన్టీఆర్ – కొరటాల మూవీకి ఫిక్స్ అయ్యింది. ఇక ఇది పవన్ కళ్యాణ్ కు షాక్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే దేవర అనే టైటిల్ సినిమాపై మరింత హైప్ పెంచే విధంగా ఉంది. కానీ ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన...
- Advertisement -
- Advertisement -