Success Story: ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు డాక్టరేట్.. ఈమె సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Success Story: చదువుకోవాలనే తపన ఒక మనిషిని ఎంతటి కష్టాన్ని అయినా భరించేలాగా చేస్తుంది ఎంతటి పేదరికం అయినా ఎదిరించేలాగా చేస్తుంది. కూలీ చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించిన అలాంటి ఒక పేద మహిళ సాధించిన విజయ గాధ ఇది. ఇంతకీ ఆ మహిళ ఎవరంటే అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడం అనే మారుమూల గ్రామానికి చెందిన సాకే భారతి డాక్టరేట్ సాధించి ఊరిలో వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రోజు తమతో కూలీకి వచ్చే భారతి డాక్టర్ అయిందని తెలుసుకుని ఆ ఊరి ప్రజల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆమె ఎలాంటి కోచింగ్ కి వెళ్లలేదు, ఎలాంటి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోలేదు. కృషి పట్టుదల పెట్టుబడిగా పెట్టి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టాన్ని అందుకుంది. అక్కడికి తన భర్త కూతురితో కలిసి వచ్చింది భారతి. ఆమెకి చిన్నతనం నుంచి చదువుకోవడం అంటే ఇష్టం. పదో తరగతి వరకు సింగనమల ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలోనూ పూర్తి చేసింది.

 

ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు కాగా ఈమె పెద్ద పిల్ల కావటంతో పరిస్థితి బాగోక మేనమామ శివప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే తన మనసుని అర్థం చేసుకున్న మేనమామ ఆమె కోరికను మన్నించి పై చదువులు చదివించేందుకు ప్రోత్సాహం అందించాడు. భారత్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది కూలి పనులకు వెళుతూనే అనంతపురంలోని ఎస్ఎస్బీఎస్ లో డిగ్రీ పీజీ పూర్తి చేసింది.

 

కాలేజీకి వెళ్లాలంటే ఊరు నుంచి కనీసం 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేక తన ఊరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకు నడిచి వెళ్లి అక్కడ బస్సు ఎక్కేది. అలా చదువుకుంటూనే ఆమె ఈజీలో మంచి మార్కులతో తీర్ణత సాధించడం తో పీహెచ్డీ కూడా చేయాలని సూచించారు ఆమె అధ్యాపకులు. దాంతో ఆమె పిహెచ్డి మీద దృష్టి పెట్టి బైనరీ మిక్సర్స్ అంశంపై పరిశోధన చేసి డాక్టర్ని సాధించింది ఈ చదువుల తల్లి. ఎంతైనా ఈమె పట్టుదలకే హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -