Operation Lotus: పంజాబ్‌లో మహారాష్ట్ర స్కెచ్.. ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ బిగ్ ఆఫర్

Operation Lotus: కేంద్రంలోని బీజేపీ తీరు దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నచోట ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి ఉన్నచోట అక్కడి ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి అధికార పార్టీలోని ఎమ్మెల్యేలకు భారీగా డబ్బులు ఆఫర్ చేసి తమవైపు తిప్పుకుని ప్రభుత్వాలను పడగొడుతోంది. ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నచోటల, రెండు, మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చోట ఇలాంటి వ్యూహన్నే కాయాయదళం అనుసరిస్తుంది.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని ప్రభుత్వంలో చీలిక తీసుకొచ్చి తర్వాత గవర్నర్ల అండతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో చీలిక తీసుకొచ్చి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర తరహా ప్లాన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ లో వర్కౌట్ చేయాలని బీజేపీ చూస్తోంది. ఇటీవల ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం తెరపైకి తీసుకురావడం అందులో భాగమేనని తెలుస్తోంది.

కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టింది. ఈ కేసుల ఒత్తిడితో ఆయనను బీజేపీలో చేర్చుకోవాలని చూసింది. సిసోడియా కాషాయ పార్టీలో చేరితే ఆయన వెంట చాలామంది వస్తారని భావించింది. ఆయనతో కలిసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ అక్కడ బీజేపీ పాచికలు ఫలించలేదు. కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ ప్రయత్నాలు బెుడిసికట్టాయి.

దీంతో ఇప్పుడు పంజాబ్ లో ఆపరేషన్ లోటస్ బీజేపీ మొదలుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పంజాబ్ ఆర్థికమంత్రి హర్పాల్ చీమా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు రూ.1375 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైందంటూ సంచలన కామెంట్స్ చేసింది. తమ ప్రభుత్వానిక కూల్చడమే లక్ష్యంగా ఆపరేషనల్ లోటస్ ప్రారంభించిందని తెలిపారు. దీని కోసం భారీ మొత్తంలో డబ్బులు సిద్దం చేసుకుందని ఆయన ఆరోపించారు.

ఇటీవల మహారాష్ట్రతో పాటు గతంలో కర్ణాటక, గోవా,అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాలను పడగొట్టినట్లుగానే పంజాబ్ లో కూడా ఆప్ ప్రభుత్వాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందనే టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం 10 మంది ఆప్ ఎమ్మెల్యే లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏడుగురిని నేరుగా స్పంప్రదించిందని, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఆఫర్ చేస్తుందని చెప్పారు.

ఇటీవల ఢిల్లీలో ఇదే తరహా ప్లాన్ బీజేపీ వేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అసెుంబ్లీలో బలనిరూపణ చేసింది. బీజేపీ వ్యూహన్ని కేజ్రీవాల్ ముందే పసిగట్టి అసెంబ్లీలో బలపరీక్షకు దిగారు. తమ ప్రభుత్వాన్ని బలాన్ని నిరూపించుకున్నారు.విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ఇప్పుడు పంజాబ్ పై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -