Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ డే అసలు కలెక్షన్లు ఇవే!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంతో విడుదలైన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12 అంటే నిన్న విడుదల అయింది. వీళ్ళిద్దరి కాంబోలో ముందు అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అదే కాంబోలో ఇంకో చిత్రం వచ్చింది. ఈ సినిమాలో శ్రీ లీల కథానాయకగా నటించగా మీనాక్షి చౌదరి స్పెషల్ పాత్రలో నటించింది.

 

అయితే ఈ సినిమా వస్తూ వస్తూనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది గుంటూరు కారం. కానీ మహేష్ బాబుకి కలెక్షన్ కి ఎటువంటి లోటు రాలేదు. ఎంత మిక్స్డ్ టాక్ తో ఉన్నా సరే 130 కోట్ల కలెక్షన్ అందుకుంది. గుంటూరు కారానికి ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత వచ్చాయో ఇప్పుడు చూద్దాం. నైజాం- 16.32 cr, సీడెడ్- 3.25 cr, ఉత్తరాంధ్ర- 4.00 cr, ఈస్ట్- 4.01 cr, వెస్ట్- 2.60 cr, గుంటూరు- 4.25 cr, కృష్ణా- 2.42 cr, నెల్లూరు- 1.50 cr, ఏపీ + తెలంగాణ (టోటల్)- 38.35 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా- 2.46 cr, ఓవర్సీస్- 10.60 cr, వరల్డ్ వైడ్ (టోటల్)- 51.41 cr (షేర్).

130 కోట్లు షేర్ ని అందుకుంటే ఈ సినిమా లాభాలలోకి వస్తుంది అయితే మొదటి రోజే 51 కోట్ల షేర్లను అందుకుంది. ఇంకా 80 కోట్లు షేర్ దొరికితే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. సంక్రాంతి కనుక మహేష్ బాబు సినిమా కి అభిమానులు కుటుంబాలతో సహా తరలి వస్తారు కనుక తేలిగ్గా లాభాలలోకి వెళ్లిపోతుంది. బాబు సినిమాకి హిట్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఎటువంటి అడ్డు రాదు అని ఈ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి.

 

కానీ మరోవైపు తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా మంచి టాక్ ని అందుకుంటుంది. మరి ఆ సినిమా ప్రభావం వల్ల ఈ సినిమా కలెక్షన్లకి ఏమైనా ఎఫెక్ట్ జరగొచ్చు ఎందుకంటే దీంతోపాటు ఇంకో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అవి కూడా మంచి టాక్ వస్తే గుంటూరు కారానికి కలెక్షన్లలో తేడా జరగొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -