Journalist: మా మీడియా మా ఇష్టం నీకేంటి నొప్పి.. ఆ జర్నలిస్ట్ కు సమాధానమిదే!

Journalist: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు అయిన విషయం మనందరికీ తెలిసిందే. జూన్ 20వ తేదీన తెల్లవారుజామున సమయంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 11 ఏళ్ళ తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు రావడంతో సంతోషాలు వెలివిరుస్తున్నాయి. మెగా కుటుంబ సభ్యులు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్, ఉపాసనలకు ఆడపిల్ల జన్మించిన సందర్భంగా ఈ వార్త అందరికీ చెప్పడం కోసం అపోలో హాస్పిటల్ ముందు మీడియా పెద్ద ఎత్తున గుమికూడింది.

 

కనీసం యాభై కెమెరాలు అయినా ఉంటాయి. ఆ కెమెరాల ఫోటోలు పట్టుకుని సోకాల్డ్ జర్నలిస్టులు నీతులు చెప్పడానికి విలువలు వల్లే వెయడానికి సోషల్ మీడియాలో దిగిపోయారు. ఆ వార్త అంత పెద్దదా అంత పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వాలా అని నోళ్లు నొక్కకోవడం ప్రారంభించారు. వీరంతా ఎవరో కాదు.. పేరు మోసిన జర్నలిస్టులమని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకున్నోళ్లు. జర్నలిజం అంటే వీరి దృష్టిలో ప్రతీ దానిలో తప్పులు వెదకడమే. ఒక జర్నలిస్ట్ ఇంత దిగజారిపోయామా అని బాధపడతాడు. అందులో అంత దిగజారిపోవడానికి ఏముందో సామాన్య జర్నలిస్టులకు అర్థం కాదు. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్.

ఆయనకు బిడ్డ పుట్టడం అంటే ఖచ్చితంగా న్యూసే. ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఆడియన్స్ కు రీడర్స్ కు అంత కంటే పెద్ద వార్త ఉండదు. ప్రాధాన్యం ఉంటుంది. జనాలు ఆసక్తి గా చూస్తారు చదువుతారు. అందుకే కవరేజీ ఇవ్వడానికి మీడియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. కాగా సమాజానికి పనికొచ్చే అంశాలపై మీడియా ఇంత ప్రాధాన్యత ఇవ్వదని కొంత మంది ఫీలైపోయారు. అది ప్రధానమంత్రి కార్యక్రమం కాదని మరికొంత మంది సైటైర్లు వేశారు. నిజానికి ఇలా చెప్పిన వాళ్లు కూడా ప్రధాని మోదీ అమెరికా టూర్ కు వెళ్లారన్న సంగతిని కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ రామ్ చరణ్ బిడ్డ విశేషాలంటే మాత్రం టక్కున చదివేస్తారు. అయినా సరే వారే నీతులు చెప్పడానికి ముందుకు వస్తారు. ఏ న్యూస్ కు ప్రయారిటీ ఇవ్వాలో దేనికి ఇవ్వాలో జర్నలిస్టులే ఒకరికి ఒకరు నీతులు చెప్పాలనుకోవడంతోనే సమస్య వస్తోంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -