Hyderabad: హైదరాబాద్ నగరంలో 25 లక్షలకే ఫ్లాట్ సొంతం.. ఏం చేయాలంటే?

Hyderabad: ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఉద్యోగాల కోసం పట్నానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పట్నంలో ఇల్లు కొనుగోలు చేయటానికి అధికమొత్తంలో డబ్బు వెచ్చించలేక వేలకు వేలు రెంట్లు కడుతున్నారు. అయితే అలా రెంట్లు కట్టలేక తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కొనాలనుకునేవారికి ఇప్పుడు ఒక శుభవార్త. హైదరాబాద్ సిటీలో అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే ఏరియాలో ఫ్లాట్ కొనాలనుకునేవారికి మణికొండ ఏరియా ఉత్తమం అని చెప్పవచ్చు.

ఈ ఏరియాలో తక్కువ గా రూ. 20 లక్షల నుంచి ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఓనర్లు, బిల్డర్ ఫ్లోర్లు అందుబాటులో ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ జోన్ లో ఉన్న మణికొండ ఏరియా అన్ని రకాలుగా బాగుంటుంది.
ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు సగటున రూ. 5,400 పలుకుతోంది. బిల్డర్ ఫ్లోర్ అయితే సగటున చదరపు అడుగుకు రూ. 4,700 పలుకుతోంది. ఇక్కడ ఫ్లాట్ కొనడం అనేది ఉత్తమమైన ఛాయిస్ అని చెప్పవచ్చు.

 

మణికొండలో 600 చదరపు అడుగుల 1 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే సగటున రూ. 32,40,000 అవుతుంది.అలాగే 2 బీహెచ్‌కే ఫ్లాట్ కి సగటున రూ. 54 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అదే బిల్డర్ ఫ్లోర్ 1 బీహెచ్‌కే ప్లాట్ లు రూ. 28 అందుబాటులో ఉన్నాయి. ఇక 2 బీహెచ్‌కే బిల్డర్ ఫ్లోర్ ఐతే రూ. 47 లక్షల్లో దొరుకుతుంది. ఒకవేళ బిల్డర్ ద్వారా ఫ్లాట్ కొనాలనుకుంటే లోన్ సదుపాయం కూడా వారే కల్పిస్తారు.

 

ఒకవేళ డైరెక్ట్ ఓనర్ దగ్గర కొనుగోలు చేస్తే లోన్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నెలకు రూ.15 నుండి రూ.20 ఈ అమ్మాయి చెల్లిస్తే కొంతకాలానికి ఆ ఫ్లాట్ మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా ఈ ఏరియాలో అద్దె దిగుబడి కూడా బాగుంది. ఈ ఏడాదిలో 4 శాతం పెరిగింది. అక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేసి అద్దెకు ఇచ్చినా మంచి లాభాలు ఉంటాయి. ఇదే మణికొండ ఏరియాలో తక్కువ స్పేస్ లో రూ. 14 లక్షలు, రూ. 18 లక్షలు, రూ. 22 లక్షలు, రూ. 25 లక్షలకు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇవి రీసేల్ ప్రాపర్టీలు. తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి మణికొండ ఏరియాలో మంచి ఫ్లాట్ లు అందుబాటులో ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -