YSRCP MLA: అన్నకు షాకిచ్చి చెల్లికి జై కొట్టాడు.. ఈ వైసీపీ ఎమ్మెల్యే తీరుకు ఫిదా అవ్వాల్సిందే!

YSRCP MLA: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున నాయకులు పార్టీలు మారుతున్నారు ఒక పార్టీలో టికెట్ రాకపోవడంతో వారందరూ మరొక పార్టీలోకి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఓ ముఖ్య నాయకుడు అన్నకు గుడ్ బై చెబుతూ చెల్లి షర్మిల చెంతకు చేరారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఈమె కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి షర్మిల తన అన్న ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూరుస్తూ వస్తున్నారు.

ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో అలా అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు అందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తము గూటికి చేరుతున్నారు.తాజాగా పి.గ‌న్న‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా కాంగ్రెస్‌లో చేర‌డం హాట్ టాపిక్‌గా మారింది.. 2019లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిట్టిబాబు అక్కడ గెలుపొందారు.

ఈసారి కూడా తనుకు గన్నవరం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈయనకు టికెట్ ఇవ్వకపోగా మరొక నేతకు టికెట్ ఇవ్వడంతో ఈయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఈయన వైయస్సార్సీపీ పార్టీకి గుడ్ బై చెబుతూ షర్మిల సమక్షంలో హస్తం గుడికి చేరారు. ఇలా ఈయన మాత్రమే కాకుండా ఈయన బాటలోనే ఇప్పటికే టికెట్ రానటువంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -