Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కు పోలీస్ సెక్యూరిటీ.. సెలబ్రిటీ స్టేటస్ దక్కిందంటూ?

Pallavi Prashanth: ఈ మధ్యకాలంలో పల్లవి ప్రశాంత్ పేరు ఎక్కువగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తుంది.ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి, సీరియల్ నటుల బ్యాచ్ అతనిని ఎంత చిన్నచూపు చూసినా తట్టుకొని, 20 మంది సెలబ్రిటీలు ఉన్న రియాలిటీ షోలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది రైతులకు స్ఫూర్తినిచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నాడు.

 

అరియానా నుంచి కీరవాణి వరకు అందరూ అతనిని సపోర్ట్ చేసిన వారే. సీరియల్ బ్యాచ్ ఇతనిని ఎంత తక్కువ చేసి చూసిందో అందరికీ తెలిసిందే. అయినా తన పని ఏంటో తాను చేసుకుంటూ,ప్రతి ఆటలో తన పనితనం నిరూపించుకుంటూ ఆటలలో గెలిచేవాడు పల్లవి ప్రశాంత్. నిజానికి పల్లవి ప్రశాంత్ ఒక లో మిడిల్ క్లాస్ వ్యక్తి యూట్యూబ్లో అన్నా.. మల్లొచ్చినా,మల్లొచ్చినా అంటే తగ్గేదేలే అనే వీడియో ఎంత వైరలైందో అందరికీ తెలిసిందే.

యూట్యూబ్ ద్వారా చాలామందికి పరిచయం అయినా పల్లవి ప్రశాంత్ కి యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని కూడా తెలియనంత అమాయకుడు. ఆ అమాయకత్వమే అతనిని మోసపోయేలాగా చేసింది. ఛానల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం రావటంతో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు పల్లవి ప్రశాంత్. కానీ వాళ్ళ నాన్న ఇచ్చిన ధైర్యంతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.

 

వ్యవసాయం చేయడం అందులో కష్టసుఖాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలాంటి స్టేటస్ సంపాదించాడంటే తాజాగా అతను సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి వెళ్ళినప్పుడు అతనిని చూడటానికి జనాలు ఎగబడ్డారు. అప్పుడు అతనికి లోకల్ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఒక సామాన్యుడు ఇలాంటి స్టేటస్ సంపాదించాడంటే నిజంగా విజయం అంటే ఇది కదా అని ప్రతి సామాన్యుడు ఆనంద పడుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -