Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ను ఎలిమినేట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఓవరాక్షన్ మరీ ఎక్కువైందంటూ?

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 13వ కంటెస్టెంట్గా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, రైతు బిడ్డని అంటూ చెప్పుకొచ్చారు. తన అమాయకత్వంతో సింపతీని గెయిన్ చేస్తున్న పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే రాను రాను పల్లవి ప్రశాంత్ కి ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది, బయటికి పంపించేయమంటూ నెటిజన్లు తెగ గోల పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏడవ వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ పై సందీప్ మాస్టర్ కెప్టెన్సీని సక్రమంగా నిర్వహించలేకపోయారు అందుకే నామినేట్ చేశాను అన్నాడు.

అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ చేసిన ఓవరాక్షన్ చూసిన ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది. నువ్వు నన్ను ఊరోడివి అన్నావు అంటూ సందీప్ ని కెలికాడు పల్లవి ప్రశాంత్.దాంతో సందీప్ కి చిర్రెత్తుకు వచ్చింది. నేను అనలేదు.. నువ్వు అన్నావు అని అంటున్నావు. నేల మీద,తినే అన్నం మీద ఒట్టు వెయ్యు అంటూ తన డాన్స్ మీద తాను ఒట్టేసాడు. దాంతో పల్లవి ప్రశాంత్ మరింతగా రెచ్చిపోయాడు.

అయితే శివాజీ నువ్వు ఫ్లోలో ఊరోడు అని సందీప్ అన్నట్లుగా చెప్పావు అన్నాడు. ఇక టేస్టీ తేజ పై కూడా పల్లవి ప్రశాంత్ తెగ రెచ్చిపోయాడు. అయితే తేజ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ తో వాగ్వాదానికి దిగాడు ఇద్దరి మధ్యలో ఫైట్ కూడా జరిగింది. అయితే పల్లవి ప్రశాంతం ఓవరాక్షన్ పై అమర్ దీప్ తల్లి కూడా ఆరోపణలు చేస్తుంది. ఆయన పిఆర్ టీం ద్వారా ఎవరైతే తనని నామినేట్ చేస్తారో వారిపై ట్రోలింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే హౌస్ లోకి అడుగు పెట్టాడు.

చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడని చెప్పు వచ్చింది. మొదటి వారాల్లో పల్లవి ప్రశాంత్ ని అమర్ విమర్శించిన పాపానికి అతని ఫ్యామిలీ పై రైతుబిడ్డ ఫ్యాన్స్ పగబట్టారు. అతని టాస్కులు ఏమో కానీ ఇప్పుడు ప్రశాంత్ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాము బయటికి పంపించేయండి అంటూ గోల పెడుతున్నారు. మరి నాగార్జున గారు ఏం చేస్తారో తెలియాలంటే వచ్చేవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -