Barrelakka: పల్లవి ప్రశాంత్ తో పెళ్లి గురించి బర్రెలక్క షాకింగ్ రియాక్షన్. ఏం జరిగిందంటే?

Barrelakka: ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయినా కామన్ పీపుల్ ఒకరు పల్లవి ప్రశాంత్ మరొకరు బర్రె లెక్క అలియాస్ శిరీష. ఇద్దరూ కామన్ పీపుల్ అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో వీరిద్దరి పేర్లు కొద్ది కాలం పాటు మారుమోగిపోయాయి. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలిచాడు. ఇక తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి సంచలనంగా మారింది బర్రెలక్క. ఈ ఇద్దరి పేర్లు మొన్నటి వరకు మారుమోగాయి. కానీ ఇప్పుడు ఇద్దరు సైలెంట్‌ అయ్యారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఒక సంచలన రూమర్‌ చక్కర్ల కొడుతుంది.

దానికి బర్రెలక్క అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. అదేమిటంటే బర్రెలు అక్క రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కొందరు అయితే వీరిద్దరి ఫోటోలను ఏకంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ సృష్టించాయి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు. పెళ్లి అయినట్టుగా కొన్ని మార్ఫింగ్‌ ఫోటోలు కూడా పెట్టారు. ఇది ఒక యూట్యూబ్‌ యాంకర్‌ ద్వారా బర్రెలక్క దృష్టికి వెళ్లింది. దీనిపై తాజాగా బర్రెలక్క స్పందించింది. పల్లవి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకున్నట్టు పుట్టించిన పుకార్లపై ఆమె స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

 

ఈ మేరకు ఆ వార్తలపై శిరీష స్పందిస్తూ.. ప్రశాంత్‌ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉందని, ఆయనకు సపోర్ట్ చేయాలని తాను వీడియో కూడా చేశాను. అందులో ఆయన్ని అన్నా అని పిలిచానను. అలాంటి అన్నతో పెళ్లి ఎలా ముడిపెడతారు. అలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించింది శిరీష. కొందరు తమ వ్యూస్‌ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పరువుని బజారున పడేస్తున్నారు అంటూ మండిపడింది. ఇది మా లైఫ్‌ అని,మా జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్‌ని నేను మొదట్నుంచి అన్నా అనే పిలిచాను. అలాంటిది అన్నని ఎలా పెళ్లి చేసుకుంటారు. ఇదెక్కడి సంస్కృతి అంటూ ఆమె ప్రశ్నించింది. యూట్యూబ్‌ ఛానెల్స్ పై ఆమె ఫైర్‌ అయ్యింది. ఇలాంటివి మానుకోవాలని తెలిపింది బర్రెలక్క. తనపై ఫేక్‌ ప్రచారాలు మానుకోవాలని తెలుపుతూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది బర్రెలక్క.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -