Pallavi Prashanth: రామభక్తిని చాటుకోవడానికి పల్లవి ప్రశాంత్ అలా చేశారా.. ఏం జరిగిందంటే?

Pallavi Prashanth: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట తో కొన్ని వందల సంవత్సరాల పాటు సాగిన ప్రతి హిందువు కల, ఆశయం నెరవేరినట్లు అయింది. ప్రాణప్రతిష్ట రోజు రామ నామ జపంతో దేశం మొత్తం మారుమోగిపోయింది. ఈ చారిత్రక ఘట్టం కన్నులారా వీక్షించడానికి ఎందరో అదృష్టవంతులు అయోధ్యకు చేరుకున్నారు.

 

కానీ ఆ అదృష్టం లేనివారు తమకు నచ్చిన రీతిలో తమ రామభక్తిని చాటుకున్నారు. కొందరు నగర సంకీర్తనలు చేస్తే, కొందరు ప్రసాదాలు పంచిపెట్టారు కొందరు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా తన రామ భక్తిని తనదైన పద్ధతిలో చాటుకున్నాడు. పల్లవి ప్రశాంతి ఏం చేసినా డిఫరెంట్ గా చేస్తాడు అని మళ్లీ అందరూ అనుకొనే లాగా చేశాడు.

కాషాయ వస్త్రాలు ధరించి వెనక కాషాయ జెండాతో ధ్యానం చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి తన రామ భక్తిని చాటుకున్నాడు. ఒకప్పుడు మళ్ళొచ్చినా అంటూ వీడియోలలో రచ్చ చేసిన పల్లవి ప్రశాంత్ తను అనుకున్నది సాధించి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.గ రైతు బిడ్డ ట్యాగ్ లైన్ తగిలించుకొని బిగ్ బాస్ లో అడుగుపెట్టిన ప్రశాంత్ అదే ట్యాగ్ లైన్ తో పెద్ద విప్లవమే సృష్టించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చేత రైతుబిడ్డ కాదు భూమి బిడ్డవి అనిపించుకున్నాడు.

 

19 మంది కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి బిగ్బాస్ విన్నర్ అవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్యుడు బిగ్ బాస్ వరకు వెళ్లటమే కష్టం అనుకుంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్ళటమే కాదు ఏకంగా విన్నర్ గా తిరిగి వచ్చాడు అతని జర్నీ నిజంగా అద్భుతమైనది. అలాంటి పల్లవి ప్రసాద్ ఇప్పుడు ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది ఏం చేసినా వైరల్ అవుతుంది. ఈ రైతుబిడ్డ జర్నీ మరింత హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వాలని ఆశిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -