Panth: మళ్లీ ఫెయిల్ అయిన పంత్.. పాపం మామూలుగా ఆడుకోలేదుగా!

Panth: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన పంత్.. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ చెత్తాట ఆడుతున్నాడు. దీంతో విమర్శకులు అతడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సంజు శాంసన్‌ను పక్కనబెట్టి పంత్‌కు ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని.. ఇకనైనా టీమ్ మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే జట్టుకు మంచిదని వాపోతున్నారు.

క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో పంత్ కేవలం 10పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ను కాదని పంత్‌కు అవకాశాలు ఇస్తుంటే అతడు జట్టుకు నష్టం చేకూరుస్తున్నాడని నెటిజన్‌లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. రానున్న బంగ్లాదేశ్ పర్యటనలో పంత్‌ను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. అయితే తనపై వచ్చిన విమర్శలను పంత్ లైట్ తీసుకుంటున్నాడు.

తన గురించి విమర్శించే వాళ్లు తన బ్యాటింగ్ గణాంకాలను చూస్తే అర్ధమవుతుందని పంత్ కౌంటర్ ఇస్తున్నాడు. తన గణాంకాలు బయట చెప్పేంత చెత్తగా ఏమీ లేవన్నాడు. పంత్ మొత్తం 29 వన్డేలు ఆడగా 107.5 స్ట్రైక్ రేటుతో 855 పరుగులు చేశాడు. అటు 66 టీ20లు ఆడి 126.4 స్ట్రైక్ రేటుతో 987 పరుగులు చేశాడు. వన్డేలలో తాను నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడేందుకు ఇష్టపడతానని పంత్ వెల్లడించాడు. జట్టు అవసరాలను బట్టి తన బ్యాటింగ్ తీరు ఉంటుందని తెలిపాడు.

పంత్‌కు అండగా నిలిచిన కెప్టెన్
నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అండగా నిలిచాడు. రిషభ్ పంత్ మ్యాచ్ విన్నరని, తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడని కొనియాడాడు. పంత్‌లో ఈ సామర్థ్యాలు ఉండటంతోనే వరుసగా విఫలమవుతున్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తుందని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. సంజూ శాంసన్ కూడా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడని.. అయితే కొన్నిసార్లు అద్భుతంగా రాణించినా వేచి చూడక తప్పదన్నాడు. సంజూ కూడా ఓ మ్యాచ్ విన్నర్ అని ధావన్ అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -