Paruchuri Gopalakrishna: జూనియర్ ఎన్టీఆర్ నడిపించిన ఆ షో నన్ను ఎమోషనల్ చేసింది: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో స్టార్ హీరో స్థాయిలో ఎదిగాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు.

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో కి కూడా గతంలో హోస్ట్ గా పని చేశాడు. హోస్ట్ గా ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎన్నో రోజులు హోస్ట్ గా చేయలేదు. అలా ఎన్టీఆర్ కొన్ని రోజులు చేసినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించి, విమర్శలను మూటగట్టుకోకుండా బాగానే రాణించాడు.

ఇదిలా ఉంటే పరుచూరి గోపాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి కొన్ని అసక్తికరమైన కామెంట్లు చేశాడు. నందమూరి తారక రామారావు గారి లాగానే నాకు తన మనవడు చిన్న ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా ఆయన హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో లో హోస్ట్ గా ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. ఆ షో లో ఓటమిపాలైన కొంతమంది వ్యక్తులను ఎన్టీఆర్ ఏ మాత్రం నిరాశపరచకుండా ఎంతో ఆత్మీయంగా వారిని ఇంటికి పంపించేవాడు అని తెలిపారు.

ఇక ఈ షో ఒక యునైటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఈ షో కి వస్తారు. ఆత్మీయ అనురాగాలన్ని షో లోనే కనిపిస్తాయి. అందుకని ఈ బిగ్ బాస్ రియాలిటీ షో నన్ను నన్ను చాలా ఎమోషనల్ చేసింది. ఇక చిన్న ఎన్టీఆర్ కూడా ఈ షోలో హోస్ట్ గా మరింత ముందుకు వెళ్లాలని పరుచూరి గోపాలకృష్ణ గతంలో ఒక వీడియో తో ఈ విషయాన్ని వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -