Naresh-Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ షాకింగ్ కామెంట్స్.. ఆమె అలాంటిదా?

Naresh-Pavitra Lokesh: పవిత్ర లోకేశ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్‌తో సహజీవనం చేస్తున్నప్పటి నుంచి ఆమె వార్తల్లో నిలుస్తోంది. నరేష్ వయసు ప్రస్తుతం అరవై ఏళ్లు దాటింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఆ ముగ్గురితోనూ నరేష్ సిల్లీ రీజన్స్ చెప్పి విడిపోయారు. ఇప్పుడు తాజాగా పవిత్ర లోకేశ్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. గతంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో పవిత్ర లోకేశ్-నరేష్ అడ్డంగా దొరికారు. దాంతో అప్పటినుంచి ఈ జంట వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల కృష్ణ మరణించినప్పుడు కూడా.. నరేష్.. పవిత్ర లోకేశ్‌ను తీసుకురావడం సన్సెషనల్‌గా మారింది. గట్టుచప్పుడు కాకుండా సహజీవనం చేసుకోకుండా.. ఇంటి పరువు తీస్తున్నాడని పలువురు ఆరోపించారు.

ఘట్టమనేని ఫ్యామిలీలో పవిత్ర లోకేష్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. కుటుంబంలో గొడవలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కృష్ణకు కూడా నరేష్ ప్రవర్తన నచ్చకపోయేదని, ఆయన వల్లే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే రమ్య కూడా పవిత్ర లోకేశ్‌పై చెప్పుతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఇంతటి గొడవలు జరుగుతున్నప్పటికీ పవిత్ర లోకేశ్-నరేష్ మాత్రం విడిపోవాలని అనుకోవడం లేదు. తమ రిలేషన్‌షిప్‌ను కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తున్నారు. తమపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల పవిత్ర లోకేశ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తమపై ట్రోల్ చేస్తున్న వారిపై కేసు ఫైల్ చేసింది. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్యపై కూడా పవిత్ర లోకేశ్ కేసు పెట్టింది. రమ్య తన పరువు తీస్తోందని, తనపై పరువు నష్టం దావా వేసింది. అలాగే తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై కూడా కేసు పెట్టింది. ఈ యూట్యూబ్ ఛానెళ్లను మూసివేయాలని, తమపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ యూట్యూబ్ ఛానెళ్ల వెనుక రమ్య హస్తం ఉందని ఆరోపించింది. తాను సంతోషంగా ఉంటే రమ్య ఓర్వలేకపోతోందని పవిత్ర లోకేశ్ మండిపడింది. ఈ ఫిర్యాదుకు సంబంధించిన అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -