Vanitha Vijay Kumar: వనిత సంచలన వ్యాఖ్యలు.. రమ్య పేరు వినలేదంటూ?

Vanitha Vijay Kumar: తెలుగు ప్రేక్షకులకు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజులల కూతురైన.. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది. 1999లో దేవి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో కూడా కనిపించలేదు.

ఇక ఈమె తన వ్యక్తిగత విషయాలలో ఎన్నోసార్లు వార్తల్లోకెక్కింది. ఆమె మూడో పెళ్లి చేసుకున్న తర్వాత మరిన్ని వివాదాలు ఎదుర్కొంది. కొంతకాలానికి అతనిని కూడా వదిలేసి ఒంటరిగా బతుకుతూ అవకాశాలు అందుకుంటూ ముందుకు కెరీర్ ను నడిపిస్తుంది. ఇక రీసెంట్ గా తెలుగులో మళ్లీ పెళ్లి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నరేష్- పవిత్ర బయోగ్రఫీ నేపథ్యంలో తెరకెక్కింది.

 

ఇందులో వనిత.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందు నరేష్ – పవిత్ర జోరుగా ప్రమోషన్స్ చేశారు. అయితే రీసెంట్ గా వనిత విజయ్ కుమార్ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. అందులో ఆమెకు తన పాత్ర గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

 

దీంతో ఆ ప్రశ్నలకు ఈ విధంగా స్పందించింది వనిత. ఇక తనకు రమ్య రఘుపతి ఎవరో తెలియదు అంటూ.. కేవలం సౌమ్య సేతుపతి పాత్రను మాత్రమే పోషించాను అని అన్నది. తనకు నిజంగా రమ్య రఘుపతి ఎవరు తెలియదని.. అందరూ ఆమె గురించి ఏవేవో చెప్పటంతో అంతవరకు మాత్రమే నాకు తెలుసు అంటూ.. ఇక డైరెక్టర్ రాజు తనకు మంచి స్క్రిప్ట్ ఉందని చెప్పటంతో.. అంతేకాకుండా అందులో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందని కూడా అన్నాడు.

 

ఆయనపై నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని.. ప్రతి సీన్, పొద్దున్నే ఇంగ్లీషులో నాకు వస్తుంది. నేను తెలుగు చదవలేను. అది ప్రిపేర్ అయ్యి చేశాను. అంతకుమించి నాకు ఎటువంటి రిఫరెన్స్ లు ఇవ్వలేదు అని తెలిపింది. ఇక ఈ సినిమా కథ మొత్తం ఎమ్మెస్ రాజు తనకు తెలిపాడని.. కానీ ఎక్కడ కూడా రమ్య రఘుపతి గురించి చెప్పలేదని.. తనకు ఎటువంటి రిఫరెన్స్ లు ఇవ్వలేదని.. ఏం చేయకూడదో చెప్పారని తెలిపింది. అంటే రమ్య రఘుపతి గురించి తనకి ఏం చెప్పలేదు అంటూ.. మేకప్ వద్దని.. ఎక్కువగా ఏడవద్దని.. ఓవరాక్షన్ చేయొద్దని.. నాచురల్ గా ఉండాలని సలహాలు ఇచ్చాడు తప్ప ఆమె గురించి ఏం చెప్పలేదు అని.. ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే చేశాను అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -