Pawan Kalyan: మరో 9 మందికి పచ్చజెండా ఊపిన పవన్ కళ్యాణ్.. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీళ్లే!

Pawan Kalyan: వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అన్ని పార్టీలు పొత్తు కుదరడంతో సీట్ల వాటా కూడా పూర్తయింది దీంతో ప్రతి ఒక్క పార్టీ నుంచి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే నలుగురు పేర్లను పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా మరో 9 మంది అభ్యర్థులను ఈయన బుధవారం సాయంత్రం మంగళగిరి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడినట్టు సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ పలువురు నేతలతో సమావేశం కావడంతో బహుశా ఈ తొమ్మిది మందికి టికెట్లు కన్ఫామ్ చేశారని తెలుస్తోంది.

మరి గత రాత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయినటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారనే విషయానికి వస్తే…పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్‌, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, విశాఖ దక్షిణం నుంచి వంశీ కృష్ణయాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, రాజోలు నుంచి దేవవరప్రసాద్‌ , తిరుపతి నుంచి ఆరని శ్రీనివాసులు గత రాత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

ఇక వీరందరికీ దాదాపు సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఈ బేటిలో భాగంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు దిశా నిర్దేశాలు కూడా చేశారు. వచ్చే ఎన్నికలలో గెలుపు చాలా ముఖ్యమని ఈ కక్ష సాధింపు ప్రభుత్వానికి స్వస్తి పలకాలి అంటే ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని సలహాలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -