Pawan Kalyan: లోక్ సభకు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ వార్తల్లో అసలు నిజం ఇదే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథ ఎన్నికలలో రెండు చోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా ఉండటం కోసం ఈయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలుపొంది తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపితో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపే ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగపోతున్నారు.

ఇదిలా ఉండగా ఈసారి కూడా పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది అయితే ఈసారి రెండు లోక్ సభ స్థానాలలో కాకుండా ఒక లోక్ సభ స్థానం ఒక పార్లమెంటు స్థానంలో ఈయన పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా ఎంపీ బరిలో దిగడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది. ఈయన ఎంపీ అభ్యర్థిగా గెలిచిస్తే ఈయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది.

ఇలా ఎంపీగా గెలిస్తే తనకు కేంద్రంలో మంత్రి పదవి ఖాయమని బీజేపీ గతంలో పవన్ కళ్యాణ్ వద్ద చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి మరోసారి స్పష్టంగా మాట్లాడటం కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవేళ బిజెపి వీరితో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు కేటాయించాలి అనే విషయం గురించి కూడా ఇప్పటికే జనసేన టిడిపి అధినేతలు చర్చించుకున్నారని కూడా సమాచారం.

ఇలా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా రాజకీయాలను శాసించే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ వదులుకోరనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఒక లోకసభ అలాగే ఒక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెల్లడించబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -