Pawan Kalyan: ఆ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లపై పవన్ ఫోకస్.. అభ్యర్థులు కూడా ఫిక్స్?

Pawan Kalyan: వచ్చే ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికలను పవన్ కాస్త లైట్ గా తీసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ బాగా దూకుడు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలనే లక్ష్యంతో పవన్ లో బలంగా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా అర్ధమవుతుంది. వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తానంటూ పవన్ ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే జగన్ ను ఎలాగైనా గద్దె దించాలనే ఆలోచనతో పవన్ ముందుకు వెళ్తున్నారు.

టీడీపీతో పొత్తుకు మరోసారి సై అని ప్రకటించారు. కానీ చంద్రబాబు పొత్తులకు ఇది సరైన సమయం కాదని, ఎన్నికలకు ముందు ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ దాదాపుగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్లే చెప్పవచ్చు. అయితే జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై పవన్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పార్టీ బలంగా ఉన్నచోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ఈ సారి ఒక పది ఎమ్మెల్యే సీట్లతో పాటు రెండు, మూడు ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ముఖ్యంగా తనకు బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఎక్కువ దృష్టి పెట్టారు.

గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి ఒక ఎమ్మెల్యేను సీటును జనసేన గెలుచుకుంది. అయితే ఈ సారి ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాల్లో బలంగా ఉన్న సీట్లపై పవన్ కన్నేవారు. ఈ రెండు జిల్లాల్లో మూడు ఎంపీ సీట్లపై పవన్ ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. విశాఖ, రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన బాగా బలంగా ఉంది. దీంతో ఈ మూడు ఎంపీ సీట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలనే యోచనలో పవన్ ఉన్నారట. నర్సాపురం నుంచి గత ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన కూడా నర్సాపురం ఎంపీ బరిలో ఉండను్నారు.

టీడీపీతో పొత్తు ఉంటే నాగబాబు ఖచ్చితంగా గెలిచే అవకాశముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇక రాజమహేంద్రవరం ఎంపీ సీటును నుంచి టీ టైం అధినేత మురళీ పోటీలోకి దిగుతారని తెలుస్తోంది. యువకుడు అయిన మురళీకి ఆర్ధిక, అంగ బలం ఉంది.టీ టైం టీ స్టాల్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన బాగా పాపులర్ అయ్యారు. రాజమండ్రిలో టీడీపీకి బలమైన టీడీపీ అభ్యర్థి లేకపోవడంతో అది జనసనకు కేాయించే అవకాశాలున్నాయి. అందేకే అక్కడ నుంచి జనసేన తరపున మురళీ పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి టీడీపీ తరపున మురళీ మోహన్ ఎంపీగా గెలిచారు.

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని తన కోడలు మాగంటి రూపను ఎంపీ బరిలోకి దింపారు. కానీ గత ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో మాంగంటి రూప రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో టీడీపీకి బలమైన అబ్యర్థి లేకపోవడంతో జనసేనకే కేటాయించే అవశాలున్నాయి. అక్కడ గత ఎన్నికల్లో జననేన తరపున ఆకుల సత్యనారాయణ పోటీ చేయగా లక్షన్నరకుపైా ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీకి నాలుగు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి.. ఈ రెండు పార్టీలో గెలిస్తే అక్కడ జనసేన గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇక విశాఖ పార్లమెంట్ స్థానంలో జనసేన కాస్త బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన తరపున జేడీ లక్ష్మినారాయణ పోటీ చేసి 3 ల క్షల వరకు ఓట్లను సాధించారు. ఇక టీడీపీ తరపున బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ పోటీ చేయగా.. ఆయనకు 4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా జనసేన, టీడీపీ గెలిస్తే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -