Pawan Kalyan: అలా చేస్తే జనసేన రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నట్లే.. పవన్ ఈ విషయాలను గమనిస్తున్నారా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలలో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఈయన బిజెపితో పొత్తు ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.

ఆంధ్రప్రదేశ్లో జనసేన టిడిపి తో కలిసి బిజెపి పొత్తు పెట్టుకోలేదని స్పష్టంగా అర్థం అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ ని కలిసినటువంటి అమిత్ షా తెలంగాణలో మాత్రం బిజెపితో జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకోవాలని మాట్లాడినట్టు తెలుస్తుంది.ఇలా అమిత్ షాతో భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా జనసేన బిజెపి పొత్తుతో పనిచేస్తాయి అనే విషయాల గురించి ఎక్కడ ప్రకటించకుండా అన్నయ్య కుమారుడు వివాహం కోసం ఇటలీ వెళ్ళిపోయారు.

అమిత్ షా పవన్ కళ్యాణ్ బేటిలో భాగంగా తెలంగాణలో బిజెపి పార్టీతో పొత్తు కుదుర్చుకోమని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వలేదట కేవలం బిజెపి పార్టీ తరఫున జనసేన ప్రచారం చేయాలని మాత్రమే కోరిందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జనసేన పార్టీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్న భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఆయన సొంతంగా ఎన్నికల బరిలోకి రాలేదు ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం ఆ పార్టీలకు పనిచేయడం తప్ప జనసేన పార్టీని ముందుకు నడిపించిన దాఖలాలు లేవు అలాంటి సమయంలోనే తెలంగాణలో బిజెపికి సపోర్ట్ గా జనసేన ప్రచారం చేయమని కోరడంతో ఈయన ఏ విషయం చెప్పకుండా తన అన్నయ్య కొడుకు పెళ్లి పేరుతో ఇటలీ వెళ్ళిపోయారని తెలుస్తోంది అయితే ఈ పెళ్లి జరిగే లోపు తెలంగాణలో నామినేషన్స్ కూడా పూర్తి అవుతాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -