Pawan Kalyan-Jagan: ఐదేళ్లలోనే జగన్ రేంజ్ తగ్గి పవన్ స్థాయి పెరిగిందా.. ఏపీ ఎన్నికలలో ఇది గమనించారా?

Pawan Kalyan-Jagan:ఉమ్మడి ఆంధ్రాలో రాజకీయ పరిణామాల్లో మార్పులకు కనీసం పదేళ్ల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు అలా కాదు.. చాలా త్వరగా మారిపోతున్నాయి. ఐదేళ్లలోనే ఊహించని పరిణామాలు మారుతున్నాయి. జనం కూడా చాలా తర్వగా రాజకీయ నాయకులను అర్థం చేసుకొని వారికి బుద్ది చెబుతున్నారు. అపారమైన అనుభవం, హైదరాబాద్ ను అభివృద్ది చేసిన ఘనత ఉన్న చంద్రబాబును 2014 ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు. కానీ, 1995-2004 మధ్య చూపించిన అభివృద్ధిని చంద్రబాబు 2014 తర్వాత చూపించలేకపోయాయి. అయితే, దానికి పలు కారణాలు ఉన్నాయి. విభజన తర్వాత ఏపీ స్వయంగా అభివృద్ధి పరిస్థితి లేదు. కేంద్రం సహకారం చాలా అవసరం. కానీ, కేంద్రం అడుగడుగునా మొండిచేయి చూపడంతో ఏపీ అభివృద్ధి కనిపించలేదు.

తనకున్నంత వరకు చంద్రబాబు ప్రయత్నించినా వాటి ఫలితాలు 2019 నాటికి కనిపించలేదు. వీటన్నింటని పక్కన పెడితే.. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నిర్ణయాలు ప్రజలకు రుచించలేదు. అందుకే, ఐదేళ్లకే టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. వైసీపీకి కనీవినీ ఎరుగని మెజార్టీని అందించారు. కానీ, ఐదేళ్లు తిరిగేసరికి జగన్ సీన్ కంప్లీట్ గా మారిపోయింది. అశేష ప్రజాభిమానాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించింది. చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చూస్తాం కానీ.. వైసీపీ అధినేత జగన్ ఆ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోలేదు. మాటిచ్చా కదా.. అని నవరత్నాలు అముల చేయడానికే ఆయన సమయం అంతా కేటాయించారు. ఇంకా ఏమైనా మిగిలితే ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, భౌతికదాడులను క్యాడర్ ను పురిగొల్పేవారు.

గత ఎన్నికల్లో ఏ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ప్రజలు ఓడించారో.. అదే ప్రత్యేకహోదా విషయంలో జగన్ కూడా ఏపీ ప్రజలను మోసం చేశారు. ఇక విభజన హామీల గురించి పొరపాటున కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. సినిమా రేంజ్ లో కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ అధికారం వచ్చిన తర్వాత పాపానికి కూడా హోదా కోసం ప్రశ్నించిన దాఖలాలు లేవు. పూర్తిగా మద్యపాన నిషేదం అని చెప్పిన జగన్.. రాష్ట్రంలో మధ్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అంతేకాదు.. మద్యం ధరలు అమాంతం పెంచేశారు. అది కూడా నాణ్యతలేని మద్యంతో మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు.

ఇక.. కొండన్ని ఆశలు పెట్టుకున్న యువతకు మాత్రం జగన్ మంచు కూడా ఓ ఉద్యోగాన్ని తీసిన దాఖలాలు లేవు. వాలంటీర్, సచివాలయం పేరుతో రెండున్నర లక్షల ఉద్యోగాలు తీసినా వాటికి గ్యారెంటీ లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రతీ ఏడాది 6,500 పోలీస్ ఉద్యోగాలు అని చెప్పారు. కానీ, ఒకే ఒకసారి నోటిఫికేషన్ తీసినా… అది కోర్టులో మగ్గిపోతుంది. ఇక, మెగా డీఎస్సీ అని మోసం చేసిన జగన్ .. ఎన్నికలకు ముందు ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో కూడా తప్పులు తడకలు ఉండటంతో అది కూడా కోర్టు పరిధిలోనే ఉంది.

ఇలా జగన్ ను నమ్ముకున్నవారంతా మోసం పోయామని.. తప్పు చేసి ఓటేశామని.. ఓటేసి తప్పు చేశామని అనుకుంటున్నారు. కానీ.. 2019 నుంచి 2024 నాటికి పవన్ తన రాజకీయ పరిణితిని పెంచుకున్నారు. ప్రజల అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు.. పక్క పార్టీ వాళ్లు కూడా అభిమానించే స్థాయికి ఎదిగారు. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమైన జనసేన వాస్తవాలను అర్థం చేసుకుంది. అంతేకాదు.. స్వయంగా పోటీ చేసిన పవన్ రెండు స్థానాల్లో ఓడిపోయి.. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా పరోక్షంగా కారణమైయ్యారు. అయితే, ఓటమికి కుంగిపోకుండా వెంటనే ప్రజల్లోకి వచ్చారు. పలు ప్రజా సమస్యలపై స్పందించారు.

రైతులకు తన సొంత డబ్బును పంచిపెట్టారు. మత్స్య కారులకు, ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. టీడీపీతో పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. వాటిని తట్టుకొని ప్రభుత్వ ఓటు బ్యాంక్ చీలకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. 24 సీట్లు మాత్రమే తీసుకొని కాపులకు ద్రోహం చేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నా.. పవన్ మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. బలానికి మించి సీట్లు తీసుకుంటే.. భవిష్యత్ ఉండదని ఆయన తెగేసి చెప్పారు. గాలిలో మేడలు కట్టలా కాకుండా.. నేల మీద ఉండి తన ఆలోచనలకు ఆచరణలో పెడుతున్నారు. దీంతో.. పవన్ పరిణితిని గతంలో పలు అనుమానాలు వ్యక్తం చేసిన వారు.. ఇప్పుడు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -