Pawan Kalyan: నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Pawan Kalyan: సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు. అయితే ఈయన తన పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా తాను రాజకీయాలలోకి రావడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రాజకీయాలలోకి అధికారం కోసం రాలేదని తెలిపారు. కేవలం సామాన్యుడికి అండగా నిలవాలని అజెండాతోనే రాజకీయాలలోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూల స్తంభాలయ్యారని తెలిపారు.

జనసేన పార్టీ స్థాపించినప్పుడు నా వెంట కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. మన పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిందని ఈయన వెల్లడించారు. ఇక సినీ ఇండస్ట్రీలో నేను ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నటుడిని కానీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆ పాపులారిటీని ఇక్కడ బదిలీ చేయలేమని తెలిపారు. అందుకే పాతికేళ్లపాటు రాజకీయాలలో పనిచేయాలన్న ఉద్దేశంతోనే వచ్చానని తెలిపారు. కానీ నా అభిమానులు మాట పడనీయరు.

నేను మోడీ గారికి నమస్కారం చేస్తే ఎందుకు నమస్కారం చేసావని ప్రశ్నిస్తారు ఆయన ఒక గొప్ప నాయకుడని ఈయన తెలిపారు. వైసీపీ వాళ్లు నిన్ను తిడుతున్నారు రాజకీయాలలోకి రావడం అవసరమా అంటూ మరికొందరు ప్రశ్నిస్తారు. ఇంట్లో వాళ్ళు రాజకీయాలు మనకెందుకు అంటారు నేనేమి చేయకపోయినా నాపై దాడి చేస్తుంటే నేనేం చేయాలి అని ఈయన ప్రశ్నించారు.

ఇక విధానాలను నేను ప్రశ్నిస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా వైసిపి వాళ్ళను ఎక్కడ తాను కించపరచలేదని తెలిపారు. అంతేకాకుండా వాళ్లు మనల్ని తొక్కేస్తాం అన్నప్పుడు మనం కూడా తొక్కుతాం అనే హెచ్చరించామని తెలిపారు. కొన్నిసార్లు నేను ఎదిగిన తీరే నాకు అడ్డుగా వస్తుందని ఈయన తెలిపారు. నా ఎదుగుదల నాపై మీ గుండెల్లో ఉన్నటువంటి అభిమానమే నాకు శాపంగా మారిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇక నేను వెళ్తే నాకోసం లక్షలాది మంది జనాలు వస్తారు. అయితే ఆ లక్షలాదిమంది ఓటర్లుగా మాత్రం మారరని ఈయన తెలిపారు. నేను గతంలో ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీ చేయాలనే భావించాను. కానీ నా వ్యూహాలు ఎవరికి అర్థం కాలేదని అందుకే గత ఎన్నికలలో అన్ని ప్రాంతాలలో పోటీ చేయలేకపోయానని తెలిపారు. ఇక భీమవరం గాజువాకలో ప్రచార సభలు నిర్వహించిన తర్వాత అక్కడ నేను ఓడిపోతానని నాకు ముందే తెలుసు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -