Pawan Kalyan Fans: పవన్ పుట్టినరోజున అభిమానులు అల్లరల్లరి.. థియేటర్ ధ్వంసం?

Pawan Kalyan Fans: టాలీవుడ్ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ గురించి అతని క్రేజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ.. వందల కొద్ది సినిమాల్లో నటించిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో వెలుగుతున్నాడు.

తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్. ఇక పవన్ కెరియర్ పరంగా ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. సొంతంగా జనసేన పార్టీ పెట్టి సీఎం కావాలనే లక్ష్యంతో సమాజానికి మంచి చేస్తూ.. తన ఆశయాన్ని నెరవేర్చుకునే పనిలో పడ్డాడు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ.. అతని ఫ్యాన్స్ అతని ట్రెండ్ ని నడిపిస్తూనే ఉన్నారు. ఇతర హీరోలకు తగ్గట్టుగా పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు అనగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఈ సందర్భంగా కర్నూల్ నగరంలో శ్రీరామ థియేటర్లో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ప్రత్యేకంగా రెండు షో లు విడుదల చేశారు.

ఇక సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అభిమానులు హాల్లో సౌండ్ చేసి సిస్టం బాగోలేదని కోపం వ్యక్తం చేశారు. థియేటర్ పై రాళ్లు విసిరి అద్దాలు మొత్తం పగలగొట్టారు. ఈ సంఘటన జరిగిన దగ్గరకు కర్నూల్ నగర రెండవ టౌన్ పోలీసులు వచ్చి ఆ అద్దాలు పగలగొట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి వాహనాలను పోలీస్ స్టేషనుకు తరలించారు. మరి ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా థియేటర్లలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -