Pawan: బీజేపీకి వీడ్కోలు చెప్పడమే పవన్ కు మిగిలిన ఆప్షన్.. ఏమైందంటే?

Pawan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకుల ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుంది. ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమి అన్నది జనసేన స్లోగన్. పవన్ కళ్యాణ్ ఇప్పటం లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

 

బీజేపీ తో పొత్తులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం ఆ రోజు ఈ రోజు కూడా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కూడా బీజేపీ ఎలాంటి చడీ చప్పుడు చేయకపోవడం ఒక ఎత్తు అయితే బీజేపీ ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. సోము వీర్రాజు అంటే బీజేపీ లో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి.

ఆయన ఆర్ఎస్ఎస్ కాలం నుంచి అందులో ఉన్నారు ఆయనే అలా చెప్పారు అంటే అందులో అంతర్యం ఏమిటో మనం అర్థం చేసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మీద ఎలాంటి అప్డేట్ కూడా లేదు. జనవరి చివరిలో ఢిల్లీ వెళ్లి వెళ్లి బిజెపి నాయకత్వంతో మాట్లాడుతారని మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తారని ప్రచారం జరిగింది అయితే పవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు దాని వెనుక ఎలాంటి అర్థాలు ఉన్నాయి అన్నది ఎవరికీ అంతు చక్కని ప్రశ్న.

 

మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి జోరుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వరుస పెట్టి ఆయన చంద్రబాబుతో భేటీ అవ్వడానికి చూస్తుంటే ఈ రెండు పార్టీలు బీజేపీ కోసం వేచి చూసే టైం కూడా అయిపోతుంది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మళ్ళీ సీఎం కాకూడదు, అదే టైంలో తాను బీజేపీ తో కలిసి పోటీ చేస్తే గెలుపు అసలు ఎంత వరకు ఉంటాయో తెలియదు అని పవన్ చెప్పడం పట్ల బీజేపీ విషయంలో పవన్ ఆలోచనలు అతి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -