Pawan: అక్కడినుంచి పవన్ యాత్ర మొదలవుతుందా.. ఏం జరిగిందంటే?

Pawan: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం టికెట్లను కన్ఫర్మ్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకున్న సంగతి మనకు తెలిసిందే.

 

జనసేన పార్టీకి సీట్లు ఖరారు అయ్యాయని తెలుస్తుంది. ఇక జనసేన పార్టీ బిజెపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతుందా లేదా అన్న విషయం తెలియదు కానీ టిడిపితో మాత్రం పొత్తు కుదుర్చుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దించి రాష్ట్రన్ని విజయపతంలో ముందుకు నడిపించడమే లక్ష్యంగా పనిచేయబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని అందుకు ముహూర్తం కూడా నిర్ణయించారని తెలుస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగవ తేదీ నుంచి అన్ని జిల్లాలలోనూ ప్రచారం చేయడమే కాకుండా కొన్ని జిల్లాలను టార్గెట్ చేసి అక్కడే పార్టీ మీటింగ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

 

వారాహి యాత్రతోపాటు కొన్ని జిల్లాలలో పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈయన ఎక్కడినుంచి పాదయాత్ర చేసి ఎక్కడ పూర్తి చేయాలనే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచార కార్యక్రమాలను అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -