Pawan: పవన్ నిర్మాతలు బలి.. ఆ ప్రాంతాల్లో సినిమాల షూటింగ్ చేయాలట!

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈయన తన సినిమా షూటింగ్ పనులతో పాటు మరోవైపు వారాహి యాత్ర కూడా ప్రారంభానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున యాగం చేసి వారాహి యాత్రను ప్రారంభించారు.

ఈ క్రమంలోనే వారాహి యాత్రలో భాగంగా ఈయనతో సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాతలందరూ కూడా ఈయనకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి రావడం విశేషం అయితే ఇకపై పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రజలలోకి వెళితే తమ సినిమా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో కూడా నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా కోసం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున షూటింగ్ కోసం భారీ సెట్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈయన ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీ కానున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపడితే కనుక సినిమా షూటింగులన్నీ కూడా ఆలస్యం అవుతాయని దీంతో పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్నటువంటి నిర్మాతలు నిండా మునిగి పోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు కానీ ఈయన ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన సినిమాలన్నీ కూడా గుంటూరు మంగళగిరి విజయవాడ పరిసర ప్రాంతాలలోనే చేయాలని నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది..

ఈ విధంగా పవన్ కళ్యాణ్ పగలంతా వారాహి యాత్రలో పాల్గొని రాత్రి సమయంలో షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే పగలు మొత్తం వారాహి యాత్ర చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ రాత్రికి సినిమా షూటింగ్లో పాల్గొంటారా అన్న సందేహం కూడా అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ఒక రోజు షూటింగ్లో పాల్గొని మరొక రోజు వారాహి యాత్ర చేపడుతారా అన్న విషయం గురించి క్లారిటీ లేదు. మరి ఈయనను నమ్మకున్న నిర్మాతల పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -