Pawan: పొత్తుల విషయంలో పవన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రచారం చేయొద్దంటూ?

Pawan: ఏపీ రాష్ట్ర రాజకీయాలపై అందరి ఆసక్తి నెలకొంది కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పొత్తుల విషయంలో జనసేన కార్యకర్తలకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

 

ఇప్పటికీ ఏ ఏ ప్రాంతంలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నారు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారనే విషయాల గురించి కూడా చర్చలు జరిగాయి. అయితే తాజగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పొత్తు విషయం గురించి పలు సలహాలు ఇచ్చారు జనసేన పార్టీ మొదటి అజెండా జనహితం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులతో ముందుకు వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం గురించి చర్చలు జరుగుతున్నాయని ఈ సమయంలోనే కార్యకర్తలు ఎవరు కూడా సహనం కోల్పోయి భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఈయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

 

జనసేన పార్టీ విధివిధానాలకు విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలను ప్రచారం చేయొద్దని ఈయన కోరారు. ఇలాంటి ప్రకటనలు చేయటం వల్ల రాష్ట్రానికి విఘాతం కలిగించిన వారే అవుతారని ఈయన తెలిపారు. పార్టీ కోసం ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్న మీకు ఏదైనా సందేహాలు ఉన్న వెంటనే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి టి హరిప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తే ఆ సందేహాలు సలహాలు అన్ని కూడా పార్టీ దృష్టికి వస్తాయి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -