PCB: ఆసియా కప్ వేదికను మారిస్తే ఒప్పుకోం: పాక్ క్రికెట్ బోర్డ్

PCB: వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాక్ గడ్డ మీద ఆడటానికి ఇష్టపడని టీమిండియా.. ఆసియా కప్ వేదికను మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ వేదికను మారిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పాడు.

ఈ విషయం మీద పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రజా మాట్లాడుతూ.. “మాకు ఆతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. ఇవ్వమని మేము కోరుకోవడం లేదు. ఆ హక్కులను మాకు మేము పారదర్శకంగా తెచ్చుకున్నాం. భారత్ రాకపోతే అది వారి ఇష్టం. అందుకోసం పాక్ నుంచి వేదికను మరోక చోటుకు మారిస్తే.. ఆసియా కప్ నుంచి మేమే వైదొలుగుతాం” అని స్పష్టం చేశారు.

ఇక టీమిండియా పాక్ గడ్డ మీద అడుగుపెట్టడం ఇష్టంలేక, మరో మార్గంలో ఆసియా కప్ వేదికను మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర ఆసియా దేశాల్లో ఆసియా కప్ ను నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదనేలా పావులు కదుపుతోంది. అయితే దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రజా మరోలా స్పందించాడు. ఇండియా రాకపోతే తాము వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఆడబోమని ప్రకటించారు.

టీమిండియా రాక నేపథ్యంలో రమీజ్ రజా మాట్లాడుతూ.. ‘ఈ అంశంలో మా నిర్ణయం మారదు. వాళ్లు(టీమిండియా) ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. అక్కడ జరగనున్న వరల్డ్ కప్‌లో మేము ఆడతాం. ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుంది. మేము చూస్తాం పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో. ఈ విషయంలో మేము కూడా దూకుడుగానే వ్యవహరిస్తాం. మా జట్టు గత రెండేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ మార్కెట్ అత్యధిక వ్యాపారం చేస్తోన్న జట్టును ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఓడించాం’ అని అన్నారు. కాగా 2009లో ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వగా.. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో అప్పటి నుండి చాలా దేశాలు పాక్ గడ్డ మీద మ్యాచ్ అంటేనే హడలి పోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -