CM Jagan: నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.. జగన్ మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరా?

CM Jagan:  సోషల్ మీడియా యుగంలో కూడా జగన్ విచ్చల విడిగా అబద్దాలు చెప్పేస్తున్నారు. రేపటి రోజున అవి రివర్స్ అవుతాయనే భయం కూడా ఏ మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించి ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేశారు. దానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం వలనే పింఛన్లు పంపిణీ ఆలస్యమైందని అంటున్నారు. వాలంటీర్లు లేకపోయినా.. ఇంటింటికి వెళ్లి వృద్దులకు పింఛన్లు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం అలా చేయలేదు. దీంతో ఎండలో వడదెబ్బ తగిలి 32 మంది చనిపోయారు. దానికి కూడా కారణం చంద్రబాబే అని అంటున్నారు.

మంచి జరిగితే.. ఆయన ఖాతాలో.. చెడు జరిగితే ప్రతిపక్షాలపై నెట్టి వేస్తున్నారు. చంద్రబాబు పింఛన్ వెయ్యి రూపాయలు ఇస్తే.. తాను మూడు వేలకు పెంచానని చెబుతున్నారు. నిజానికి రూ. 200 ఉన్న పింఛన్ ను చంద్రబాబు రెండు వేల రూపయాలకు పెంచారు. జగన్ దాన్ని దశల వారీగా మూడు వేలు చేశారు. కానీ, చంద్రబాబు వెయ్యి రూపాయలే ఇచ్చారని ఐదేళ్లుగా జగన్ అబద్దాలు చెబుతున్నారు.

అంతేకాదు.. మ్యానిఫెస్టోలో లేని చాలా అంశాలను అమలు చేశామని కూడా జగన్ డబ్బా కొట్టుకుంటున్నారు. మ్యానిఫెస్టోలో లేని అంశాలను పక్కన పెడితే.. ఉన్న హామీలను ఎంతవరకు నరవేర్చారని చర్చించకుంటే 10 శాతం కూడా అమలు చేసింది లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. ఐదేళ్ల నుంచి వారెందుకు ఆందోళన చేస్తారో సజ్జల చెప్పాలి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తున్నారు. వారికి న్యాయం జరిగితే ధర్నాలు చేస్తారా? మెగా డీఎస్సీ అని చెప్పి ఐదేళ్లు అవుతుంది. ఇప్పటికీ దానిపై ఉలుకు లేదు పలుకూలేదు. ఇప్పుడు డీఎస్పీ పేరుతో హడావుడి చేస్తున్నారు తప్పా.. దానికి న్యాయపరమైన చిక్కులు వదలడం లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు మరోసారి వైసీపీని గెలిపించడానికి సిద్దమా అని అడుగుతున్నారు.

ఇలా చాలా హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. అంతెందుకు.. విభజన హామీల విషయంలో ఎంతవరకు చిత్తశుద్ది చూపించారు? ప్రత్యేకహోదా పేరుతోనే జనంలోకి వెళ్లారు. గెలిచిన తర్వాత దాన్ని మరిచారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కనీసం అతీగతీ లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రైల్వే జోన్ ఏమైందో కూడా తెలియదు. ఇవన్నీ జగన్ ఇచ్చిన హామీలే కదా? ఇవన్ని అమలు కాకుండా మిగిలిపోయినవే కదా? అమలు చేస్తున్నవి అయినా పద్దతిగా చేస్తున్నారా? అంటే అదీ లేదు. నవరత్నాల పేరుతో కొన్ని హామీలు అమలు చేస్తున్నా.. కారు ఉందని.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని తెల్ల రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. అంటే.. రేషన్ కార్డు లేకపోతే వారికి పథకాలు ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లుకు పెంచనని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు పెంచారు. అయితే జగన్ మాటలను నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. ఎందుకంటే ఐదేళ్లుగా ఆయన అబద్దాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -