Health Tips: ఈ వంటకం తింటే నడవలేని వాళ్లు లేచి పరుగెడతారా.. ఏమైందంటే?

Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే ఎంతో మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.అయితే మన పెద్దవారు ఇప్పటికి చాలా దృఢంగా ఉండడం మనం చూస్తుంటాము అయితే వారు అలా ఉండడానికి గల కారణం వారు తీసుకొని ఆహారమే అని చెప్పాలి.అప్పట్లో పెద్దవారు ఎక్కువగా తృణధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు అలాగే నువ్వుల నూనె ఎంతో విరివిగా ఉపయోగించేవారు.

ఇలా నువ్వుల నూనె ఉపయోగిస్తూ నువ్వులతో తయారు చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఇప్పటికి వారు ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు.నువ్వులలో ఎక్కువగా కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి దీంతో ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా మన శరీరంలో ఏ విధమైనటువంటి రక్తహీనత సమస్య లేకుండా కాపాడుతుంది. ఇందులో పాలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఇది బిపిని నియంత్రించడంలో దోహదపడతాయి.

ఇలా ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఈ నువ్వులతో తయారు చేసిన లడ్డూలను ప్రతిరోజు ఉదయం అల్పాహారం తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ మన శరీరానికి అంది ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కాపాడతాయి. ఈ నువ్వుల లడ్డూలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఏ విధమైన అలసట నీరసం అనేవి ఉండవు. అలాగే చర్మం కూడా ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

నువ్వుల లడ్డూలలో 62 క్యాలరీలు ఉండటం వల్ల వీటిని తీసుకుంటే శరీర బరువు పెరుగుతారు అన్న భయం కూడా ఉండదు.ఈ నువ్వులలో ఉన్నటువంటి పోషకాలు శరీరంలో కొవ్వులను కరిగించి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా కాల్షియం ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి కీళ్ల నొప్పులు లేకుండా మనం వయసు పైబడిన ఏ విధమైనటువంటి కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు లేకుండా నడవగలము. అలాగే విరిగిన ఎముకలు కూడా అతుక్కోవడానికి ఇందులో ఉన్నటువంటి కాల్షియం ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి పోషకాలు మనలో వృద్ధాప్య ఛాయాలను కూడా తగ్గిస్తాయని చెప్పాలి. ఇలా నువ్వులు ఆరోగ్యపరంగాను సౌందర్య పరంగాను ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -